గురువారం 28 మే 2020
Cinema - May 08, 2020 , 08:32:27

సితార నోట మ‌హేష్ పాట‌..!

సితార నోట మ‌హేష్ పాట‌..!

మ‌హేష్ గారాల ప‌ట్టి సితార నెటిజ‌న్స్‌కి చాలా సుప‌రిచితం. ఇటు మ‌హేష్ లేదంటే అటు న‌మ్ర‌త త‌ర‌చు సితార‌కి సంబంధించిన వీడియోలు షేర్ చేస్తూ నెటిజ‌న్స్‌ని అల‌రిస్తుంటారు. తాజాగా న‌మ్ర‌త త‌న ఇన్‌స్టాగ్రాములో సితార పాట పాడిన వీడియోని షేర్ చేసింది. ఇందులో లిటిల్ ప్రిన్స్ 2018లో వ‌చ్చిన భ‌ర‌త్ అనే నేను సినిమాలోని ఇది క‌ల‌లా ఉన్న‌దే అనే సాంగ్‌ని ఆల‌పించింది. సితార ఎనర్జీని చూసి ఫ్యాన్స్ మురిసిపోయారు. ఈ వీడియోకి నాన్న కూతురు అనే కామెంట్ పెట్టింది న‌మ్ర‌త‌

'సరిలేరు మీకెవ్వరు' సినిమా తర్వాత లాక్‌డౌన్ రావ‌డంతో మ‌రో సినిమా చేసేందుకు మ‌హేష్‌కి చాలా గ్యాప్ వ‌చ్చింది. దీంతో ఇంటికే పరిమితం అయిన మ‌హేష్‌ ఇద్దరు పిల్లలతో సరదాగా గడుపుతున్నారు.  ముఖ్యంగా కూతురు సితార అయితే మహేష్ ని ఒక్క క్షణం కూడా వదలడం లేదట. 
logo