శనివారం 30 మే 2020
Cinema - May 03, 2020 , 14:48:57

న‌వ్వుతూ బ్ర‌త‌కాలి: మహేష్ బాబు

న‌వ్వుతూ బ్ర‌త‌కాలి: మహేష్ బాబు

ప్రతి సంవత్సరం మే నెల మొదటి ఆదివారంను ప్రపంచ హాస్య దినోత్సవంగా జ‌రుపుకుంటున్న సంగ‌తి తెలిసిందే. మొద‌ట‌ జనవరి రెండో ఆదివారం నాడు జరుపుకునే వారు. జనవరిలో చలి ఎక్కువగా ఉంటుందన్న హాస్య ప్రియులు కోరిక మేర లాఫ్టర్స్‌ క్లబ్‌ ఇంటర్నేషనల్‌ దీన్ని మే మొదటి ఆదివారం జ‌రుపుతూ వ‌చ్చింది. ఈ రోజు ప్ర‌పంచ న‌వ్వుల దినోత్స‌వం సంద‌ర్భంగా ప్ర‌ముఖులు కూడా సంతోషంగా న‌వ్వుతూ ఉన్న ఫోటోల‌ని షేర్ చేస్తున్నారు.

తాజాగా మ‌హేష్ బాబు త‌న త‌న‌యుడు గౌతమ్‌తో క‌లిసి న‌వ్వుతున్న ఫోటో ఒక‌టి షేర్ చేశాడు. ప్ర‌తి క్ష‌ణం, ప్ర‌తి రోజు న‌వ్వుతూ హ్యాపీగా ఉండాల‌ని కోరాడు. అలానే సితార‌తో క‌లిసి మ‌హేష్ ఫ‌న్ మూమెంట్ వీడియో ఒక‌టి ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు  కొడుతుంది. 


logo