బుధవారం 12 ఆగస్టు 2020
Cinema - Jul 03, 2020 , 18:46:11

సౌత్‌లో మ‌హేష్ బాబు సరికొత్త రికార్డ్‌..

 సౌత్‌లో మ‌హేష్ బాబు సరికొత్త రికార్డ్‌..

‌తెలుగు చిత్రసీమలో తిరుగులేని అభిమానగణం పొందిన స్టార్స్‌లో మహేష్‌బాబు ఒకరు. యువతతో పాటు ఫ్యామిలీ ఆడియెన్స్‌లో ఆయనకు మంచి ఫాలోయింగ్‌ ఉంది. తాజాగా మహేష్‌బాబు సోషల్‌మీడియా ట్విటర్‌లో సరికొత్త రికార్డును సొంతం చేసుకున్నారు. కోటిమంది ఫాలోవర్స్‌ను సంపాదించుకున్న తొలి దక్షిణాది హీరోగా నిలిచారు. సౌత్ ఇండియాలోనే ఆ ఘనత సాధించిన మొదటి హీరోగా మహేష్ రికార్డులకు ఎక్కాడు 9.1 మిలియన్ల ఫాలోవర్స్‌తో తమిళ కథానాయకుడు ధనుష్‌ రెండోస్థానంలో ఉన్నారు.

తాను సాధించిన సరికొత్త ఫీట్‌ పట్ల ఆనందం వ్య‌క్తం చేస్తూ ట్వీట్ చేశారు మ‌హేష్ బాబు . నా మనసులోని కృతజ్ఞతాభావాన్ని వివరించి చెప్పడానికి 10 మిలియన్ల ధన్యవాదాలు కూడా సరిపోవు. మీ అందరితో వర్చువల్‌గా ఇలా కనెక్ట్ అయినందుకు నిజంగా చాలా సంతోషిస్తున్నాను. ఎంతో ప్రేమతో అందరికీ ధన్యవాదాలు. 10 మిలియన్ల బలాన్నిచ్చారు అని మ‌హేష్ ట్వీట్ చేశాడు ఇక మహేష్ తన నెక్స్ట్ మూవీ దర్శకుడు పరుశురాం తో చేస్తున్నారు . సర్కారు వారి పాట టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ మూవీ షూటింగ్ ఈ ఏడాది చివర్లో మొదలుకానుంది. మైత్రి మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్ మరియు జి ఎమ్ బి ఎంటర్టైన్మెంట్స్ కలిసి నిర్మిస్తున్నాయి. కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుండగా థమన్ సంగీతం అందిస్తున్నారు.


logo