గురువారం 24 సెప్టెంబర్ 2020
Cinema - Aug 09, 2020 , 19:36:02

పుట్టిన రోజు సందర్భంగా మొక్కనాటిన మహేశ్‌.. వీడియో

పుట్టిన రోజు సందర్భంగా మొక్కనాటిన మహేశ్‌.. వీడియో

హైదరాబాద్‌ : టాలీవుడ్‌ ప్రిన్స్‌ మహేశ్‌బాబు పుట్టినరోజు సందర్భంగా ఆదివారం తన నివాసంలో మొక్క నాటారు. ఎంపీ సంతోశ్‌ కుమార్‌ ప్రవేశపెట్టిన గ్రీన్‌ ఛాలెంజ్‌లో భాగంగా  ఆయన మొక్క నాటుతూ పుట్టినరోజును జరుపుకోవడానికి ఇంత కంటే మంచి మార్గం లేదన్నారు. మహేశ్‌ మొక్క నాటుతున్న వీడియోను ట్విట్టర్‌ ఖాతాలో షేర్‌ చేస్తూ ఈ ఛాలెంజ్‌ను సరిహద్దులు దాటనివ్వాలని కోరారు. 

ఈ గ్రీన్‌ ఛాలెంజ్‌కు ప్రతి ఒక్కరూ మద్దతు తెలపాల్సిందిగా కోరుతున్నానన్నారు. పచ్చని ప్రపంచం వైపుకు అడుగులు వేయాలని పిలుపునిచ్చారు. తాను మొక్క నాటడమే కాకుండా జూ. ఎన్టీఆర్‌, తమిళ హీరో థళపతి విజయ్‌, శృతి హాసన్‌కు ఆయన ఛాలెంజ్‌ విసిరారు. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo