శనివారం 24 అక్టోబర్ 2020
Cinema - Sep 17, 2020 , 18:39:14

కొత్త హీరోయిన్ వేట‌లో మ‌హేశ్ టీం‌..!

కొత్త హీరోయిన్ వేట‌లో మ‌హేశ్ టీం‌..!

టాలీవుడ్ యాక్ట‌ర్ మ‌హేశ్‌బాబు, ప‌రశురామ్ క్రేజీ కాంబోల వ‌స్తున్న చిత్రం స‌ర్కారు వారి పాట‌. ఈ సినిమా ఫ‌స్ట్ లుక్ ఆడియెన్స్ నుంచి అద్బుత‌మై స్పంద‌న వ‌చ్చింది. మార్చిలోనే ఈ మూవీ రెగ్యుల‌ర్ షూటింగ్ ప్రారంభ‌మ‌వ్వాల్సి ఉండ‌గా కోవిడ్ కార‌ణంగా షూటింగ్ నిలిచిపోయింది. డెట్రాయిట్ లో షూటింగ్ కోసం టీం ప్లాన్ చేస్తుంద‌ట‌. ఇదిలా ఉంటే ఈ చిత్రంలో హీరోయిన్ గా కీర్తిసురేశ్ ను ఫైన‌ల్ చేసిన‌ట్టు ఇప్ప‌టికే వార్త‌లు వ‌చ్చాయి. అయితే ఈ మ‌ధ్య‌కాలంలో కీర్తిసురేశ్ చాలా స్లిమ్ గా, ఛార్మింగ్ లుక్ లోకి మారింది.

అయితే స‌ర్కారు వారి పాట మూవీ టీం హీరోయిన్ గా కొత్త న‌టిని ఎంపిక చేయాల‌ని భావిస్తుంద‌ని టాక్ న‌డుస్తోంది. వీలైనంత త‌క్కువ బ‌డ్జెట్ తో తీయ‌నున్న నేప‌థ్యంలో ఈ సినిమాలో స్టార్ హీరోయిన్ కాకుండా కొత్త హీరోయిన్ కోసం వేట‌లో ప‌డిన‌ట్ ఇన్ సైడ్ టాక్ వినిపిస్తోంది. ప‌ర‌శురాం ఇప్ప‌టివ‌ర‌కు హీరోయిన్ ఎవ‌ర‌నే విష‌యంపై అధికారికంగా ప్ర‌క‌ట‌న చేయలేదు. మ‌హేశ్‌బాబు, 14 రీల్స్ ప్ల‌స్ ఎంట‌ర్ టైన్ మెంట్స్ సంయుక్తంగా ఈ మూవీని నిర్మిస్తున్నాయి. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo