సోమవారం 01 జూన్ 2020
Cinema - May 22, 2020 , 10:48:08

మ‌హేష్‌- న‌మ్ర‌త రొమాంటిక్ వీడియో

మ‌హేష్‌- న‌మ్ర‌త రొమాంటిక్ వీడియో

టాలీవుడ్ మోస్ట్ ల‌వ‌బుల్ క‌పుల్స్‌లో మ‌హేష్‌, న‌మ్ర‌త ఒక‌రు. లాక్‌డౌన్ స‌మ‌యాన్ని చ‌క్క‌గా సద్వినియోగం చేసుకుంటున్న ఈ జంట త‌ర‌చు సోషల్ మీడియా ద్వారా ఫోటోలు లేదంటే వీడియోలు షేర్ చేస్తూ ఫ్యాన్స్‌ని అల‌రిస్తున్నారు. ఇటీవ‌ల న‌మ్ర‌త త‌న ఇన్‌స్టాగ్రామ్ ద్వారా మ‌హేష్‌,గౌతమ్ ఆడిన ఓ ఫ‌న్నీ గేమ్ వీడియో షేర్ చేసిన సంగ‌తి తెలిసిందే. 

వింకింగ్ గేమ్ ఒక‌టి మ‌నంద‌రికి సుప‌రిచితం. ఇందులో ఇద్ద‌రు వ్య‌క్తులు ఒక‌రి క‌ళ్ళ‌ల్లోకి ఒక‌రు చూస్తూ రెప్ప ఆర్ప‌కూడ‌దు. ఆర్పితే  వారు ఓడిపోయిన‌ట్టే. ఈ గేమ్‌లో గౌతమ్ ఓడిపోయాడు. ఇందులో ఎక్స్‌ప‌ర్ట్ అయిన న‌మ్ర‌త కూడా మ‌హేష్‌తో ఆడి ఓడిపోయింది. మ‌హేష్‌తో ఈ గేమ్‌లో గెల‌వ‌లేక‌పోయాను అని నమ్ర‌త చెప్పుకొచ్చింది. ఎంతో రొమాంటిక్‌గ ఉన్న ఈ వీడియోపై మీరు ఓ లుక్కేయండి.  logo