గురువారం 04 జూన్ 2020
Cinema - May 14, 2020 , 14:54:27

పెళ్ళి పీట‌లెక్కిన ‘రంగస్థలం’ న‌టుడు..!

పెళ్ళి పీట‌లెక్కిన ‘రంగస్థలం’ న‌టుడు..!

లాక్‌డౌన్ కొన‌సాగుతున్న‌ప్పటికీ, మే 14న మంచి శుభ‌ముహూర్తం కావ‌డంతో  ప‌లువురు పెళ్ళిపీట‌లెక్కుతున్నారు. టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ త‌న ప్రేయ‌సి ప‌ల్ల‌వితో ఇప్ప‌టికే పెళ్ళి పీట‌లెక్క‌గా, ఇదే రోజు ‘రంగస్థలం’ ఫేమ్‌ మహేశ్‌ ఆచంట ఓ ఇంటి వాడయ్యాడు. తూర్పు గోదావరి జిల్లా రాజోలుకు చెందిన మహేశ్‌.. తన సమీప బంధువుల అమ్మాయి పావనిని గురువారం పెళ్లి చేసుకున్నాడు

కొద్ది రోజుల క్రితం మ‌హేష్‌, పావనితో నిశ్చితార్ధం జ‌ర‌గ‌గా, ఈ రోజు  కొద్ది మంది కుటుంబ స‌భ్యుల స‌మ‌క్షంలో ఇద్ద‌రు ఏడ‌డుగులు వేశారు. వారికి ప‌లువురు ప్ర‌ముఖులు శుభాసిస్సులు అందించారు. జ‌బ‌ర్థ‌స్త్ కార్య‌క్రమంతో పాపులారిటీ పొందిన మ‌హేష్ రంగస్థలం చిత్రంలో రామ్ చ‌రణ్‌ అసిస్టెంట్‌గా న‌టించాడు. అలానే మ‌హాన‌టి చిత్రంలో ముఖ్య పాత్ర పోషించాడు . ఆయ‌న న‌ట‌న‌కి ప్రేక్ష‌కులు ఫిదా అయ్యారు.logo