టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం సర్కారు వారి పాట సినిమా షూటింగ్ లో ఉన్నాడు. కోవిడ్ రూల్స్ ప్రకారం తక్కువమందితోనే షూటింగ్ ని కొనసాగిస్తున్నారు. రెండో షెడ్యూల్ ల్లో పాల్గొన్న మహేష్ లుక్ కి సంబంధించి ఓ ఫోటో సోషల్ మీడియాలో హడావుడి చేస్తోంది. బ్లూ జీన్స్ అండ్ బ్లూ చెక్ షర్ట్ లో బ్లూ మాస్క్ లో ఏదో ఆలోచించుకుంటూ నడుస్తున్నట్లు ఆ ఫోటోలో కనిపిస్తున్నాడు. కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోన్న ఈసినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కానుంది. దేవిశ్రీ సంగీతం అందిస్తున్నాడు. పరుశురామ్ డైరక్షన్ లో మైత్రీ మూవీ మేకర్స్ ఈసనిమాని నిర్మిస్తోంది.