మంగళవారం 26 మే 2020
Cinema - May 23, 2020 , 09:02:11

త‌న‌యుడితో మ‌హేష్ ఫ‌న్.. వీడియో వైర‌ల్‌

త‌న‌యుడితో మ‌హేష్ ఫ‌న్.. వీడియో వైర‌ల్‌

సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు ఫ్యామిలీ ప‌ర్సన్ అనే విష‌యం మ‌నంద‌రికి తెలిసిందే. లాక్‌డౌన్ వ‌ల‌న పూర్తిగా ఇంటికే ప‌రిమిత‌మ‌యిన మ‌హేష్ ఈ అమూల్య‌మైన స‌మ‌యాన్ని కొడుకు గౌత‌మ్‌, కూతురు సితార‌తో గ‌డుపుతున్నారు. పిల్ల‌ల‌తో ఆట‌పాట‌లాడుతూ మ‌హేష్ చేసే ఫ‌న్ నెటిజ‌న్స్‌కి మంచి వినోదాన్ని అందిస్తుంది.

ఇటీవ‌ల త‌న‌యుడితో క‌ళ్ళ‌ల్లో క‌ళ్లు పెట్టి చూస్తూ ఓ గేమ్ ఆడిన మ‌హేష్ తాజాగా త‌న గౌత‌మ్‌తో క‌లిసి హైట్ చెక్ చేసుకున్నాడు. ఇద్ద‌రిలో ఎవ‌రు హైట్ అని చేసుకుంటుండ‌గా, గౌత‌మ్ న‌వ్వుతూనే ఉన్నాడు. దాదాపు తండ్రి హైట్ పెరిగిన గౌత‌మ్‌ని చూసి ఘ‌ట్ట‌మ‌నేని అభిమానులు ఆశ్చ‌ర్య‌పోతున్నారు. కాగా, మే 31న మ‌హేష్ త‌దుప‌రి ప్రాజెక్ట్‌కి సంబంధించిన అఫీషియ‌ల్ ప్ర‌క‌ట‌న రానుంది. logo