శుక్రవారం 18 సెప్టెంబర్ 2020
Cinema - Aug 07, 2020 , 10:38:47

త‌న అభిమానుల‌కి మ‌హేష్ విజ్ఞ‌ప్తి

త‌న అభిమానుల‌కి మ‌హేష్ విజ్ఞ‌ప్తి

టాలీవుడ్ టాప్ హీరోల‌లో సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు ఒక‌రు అనే సంగ‌తి తెలిసిందే. ఆయ‌నకి లెక్క‌కి మించిన అభిమానులు ఉన్నారు. మ‌హేష్ సినిమాల కోసం ఫ్యాన్స్ క‌ళ్ళ‌ల్లో ఒత్తులు వేసుకొని మ‌రీ ఎదురు చూస్తుంటారు. మ‌హేష్ - ప‌ర‌శురాం కాంబినేష‌న్‌లో తెర‌కెక్క‌నున్న స‌ర్కారు వారి పాట సినిమా ఎప్పుడు సెట్స్ పైకి వెళుతుందా అని ఫ్యాన్స్ ఆస‌క్తిగా గ‌మ‌నిస్తున్నారు.

ఇదిలా ఉంటే, ఆగ‌స్ట్ 9న మ‌హేష్  45వ వ‌సంతంలోకి అడుగుపెట్ట‌నున్నారు. ఈ సంద‌ర్భంగా ఫ్యాన్స్ మ‌హేష్ బ‌ర్త్‌డే వేడుక‌లని ఘ‌నంగా జ‌ర‌పాల‌ని ప్లాన్ చేస్తున్నారు. ఈ నేప‌థ్యంలో మ‌హేష్ త‌న అభిమానుల‌కి లెట‌ర్ ద్వారా సామూహిక వేడుక‌లకు దూరంగా ఉంటూ ఇంట్లో క్షేమంగా ఉండాల‌ని కోరారు. 

ప్రియ‌మైన అభిమానులారా, మీరంద‌రు నాకు తోడుగా ఉండ‌డం నా అదృష్టం. నా పుట్టిన రోజు ప్ర‌త్యేక‌మైన రోజుగా గుర్తుండాల‌ని మీరు చేస్తున్న మంచి ప‌నుల‌కి చాలా సంతోషంగా ఉంది. అందుకు మీ అంద‌రిని అభినందిస్తున్నాను. ప్ర‌స్తుతం క‌రోనాతో మ‌నమంద‌రం చేస్తున్న యుద్ధంలో సుర‌క్షితంగా ఉండ‌డం అన్నింటిక‌న్నా ముఖ్యం. నా పుట్టిన రోజున అభిమానులంద‌రు సామూహిక వేడుక‌లకి దూరంగా ఉంటూ ఇంటిప‌ట్టునే ఉండాల‌ని కోరారు .‌. కాగా, నెల రోజుల ముందు నుండే మ‌హేష్ బ‌ర్త్‌డే ట్యాగ్ తో పాటు కామ‌న్ డీపీ ఏర్పాటు చేసిన ఫ్యాన్స్ విస్తృతంగా షేర్ చేస్తూ స‌రికొత్త రికార్డ్ నెల‌కొల్పారు.


logo