శనివారం 06 జూన్ 2020
Cinema - May 06, 2020 , 12:18:31

మే 31న ఫ్యాన్స్‌కి ట్రీట్ ఇవ్వ‌నున్న మ‌హేష్..!

మే 31న ఫ్యాన్స్‌కి ట్రీట్ ఇవ్వ‌నున్న మ‌హేష్..!

ఈ ఏడాది సరిలేరు నీకెవ్వ‌రు చిత్రంతో ప్రేక్ష‌కుల‌ని ప‌ల‌క‌రించిన మ‌హేష్ బాబు త‌న త‌దుప‌రి చిత్రాన్ని ప‌ర‌శురాం ద‌ర్శ‌క‌త్వంలో చేయ‌నున్న సంగ‌తి తెలిసిందే. ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించి ఇప్ప‌టి వ‌ర‌కు అఫీషియ‌ల్ ప్ర‌క‌ట‌న రాలేదు. మే 31న కృష్ణ బ‌ర్త్‌డే సంద‌ర్భంగా త‌న 27వ చిత్రానికి సంబంధించి అఫీషియ‌ల్ ప్ర‌క‌ట‌న చేయాల‌ని మ‌హేష్ భావిస్తున్న‌ట్టు తెలుస్తుంది.

వీలైతే మే 31న లిమిటెడ్ టీమ్  మహేష్ - పరుశ్ రామ్ మూవీ పూజా కార్య‌క్ర‌మాలు జ‌రుపుకోనుంద‌ని స‌మాచారం. ఇందులో మ‌హేష్ లుక్ డిఫ‌రెంట్‌గా ఉంటుంద‌ని తెలుస్తుంది. క‌థానాయిక ఎవ‌ర‌నే దానిపై ఇప్ప‌టి వ‌ర‌కు క్లారిటీ లేదు.  ఈ సినిమాని మైత్రీ మూవీ మేకర్స్ మరియు 14 రీల్స్ ఎంబీ ప్రొడక్షన్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మించేందుకు ప్లాన్ చేస్తున్నాయి.  ఈ సినిమా మ‌హేష్ ఫ్యాన్స్‌కి ఫుల్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ అందిస్తుంద‌ని అంటున్నారు.


logo