శుక్రవారం 05 జూన్ 2020
Cinema - Mar 10, 2020 , 09:13:53

మ‌రో కొత్త బిజినెస్ లోకి మ‌హేష్‌..!

మ‌రో కొత్త బిజినెస్ లోకి మ‌హేష్‌..!

సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు ఒక‌వైపు సినిమాలు చేస్తూనే మ‌రోవైపు వ్యాపారాల‌లోను త‌న మార్క్ చూపించుకుంటున్న విష‌యం తెలిసిందే. ఇప్ప‌టికే ఏఎంబీ సినిమాస్‌, హంబుల్ డ్ర‌సెస్‌తో పాటు జీఎంబీ ఎంట‌ర్‌టైన్‌మెంట్ బేన‌ర్‌లో ప‌లు చిత్రాలు చేస్తున్నారు. తాజాగా ఆయ‌న మ‌రో కొత్త బిజినెస్ మొద‌లు పెట్ట‌నున్న‌ట్టు తెలుస్తుంది. ప‌ర్‌ఫ్యూమ్ బిజినెస్ విష‌యంపై మ‌హేష్ కొద్ది రోజులుగా చ‌ర్చ‌లు జ‌రుపుతున్నార‌ని ఇండ‌స్ట్రీ వర్గాల‌లో గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. ఈ వార్త‌లో ఎంత నిజ‌ముందనే విష‌యంపై త్వ‌ర‌లో క్లారిటీ రానుంది. ఇటీవ‌ల స‌రిలేరు నీకెవ్వ‌రు చిత్రంతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన మ‌హేష్ బాబు త్వ‌ర‌లో వంశీ పైడిప‌ల్లి లేదంటే ప‌ర‌శురాం ద‌ర్శ‌క‌త్వంలో ఓ చిత్రం చేయ‌నున్నాడు. మ‌రోవైపు చిరు 152వ చిత్రంలోను ముఖ్య పాత్ర పోషించ‌నున్న‌ట్టు ప్ర‌చారం జ‌రుగుతుంది .


logo