ముంబై, మార్చి 22: జర్మన్ లగ్జరీ కార్ల తయారీ సంస్థ ఆడీ ‘ఎస్5 స్పోర్ట్‌బ్యాక్’ ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌ను భారత మార్కెట్లో ప్రవేశపెట్టింది. ఐదు సీట్లు, నాలుగు డోర్లను కలిగి ఉండే ఈ కారు ఎక్స్-షోరూమ్ ప్రారంభ ధరను రూ.79.06 లక్షలుగా నిర్ణయించింది. 3.0 లీటర్ ట్విన్-టర్బో టీఎఫ్ఎస్ఐ పెట్రోల్ ఇంజిన్‌ను కలిగి ఉండే ఎస్5 స్పోర్ట్‌బ్యాక్ ఫేస్‌లిఫ్ట్ వెర్షన్లో ఫ్లాట్-బాటమ్డ్ స్టీరింగ్ వీల్, స్పోర్ట్ ఫ్రంట్ సీట్స్, వర్చువల్ కాక్‌పిట్ ప్లస్, అప్డేటెడ్ మల్టీమీడియా ఇంటర్ఫేస్ సిస్టమ్, పనోరమిక్ గ్లాస్ సన్‌రూఫ్ లాంటి ఫీచర్లను పొందుపర్చినట్లు కంపెనీ వెల్లడించింది.