శనివారం 06 జూన్ 2020
Cinema - May 17, 2020 , 11:56:26

మ‌హేష్ కూల్ లుక్‌.. షాక్ అవుతున్న ఫ్యాన్స్

మ‌హేష్ కూల్ లుక్‌.. షాక్ అవుతున్న ఫ్యాన్స్

లాక్‌డౌన్ వ‌ల‌న ఇంటికి ప‌రిమిత‌మైన మ‌హేష్ త‌న పిల్ల‌ల‌తో అమూల్య‌మైన స‌మ‌యం గడుపుతున్నాడు.  సితార‌, గౌత‌మ్‌తో స‌ర‌దా ఆట‌లు ఆడుకుంటూ వాటికి సంబంధించిన ఫోటోల‌ని సోష‌ల్ మీడియాలో షేర్ చేస్తున్నాడు. అయితే ఇటీవ‌ల మ‌హేష్ షేర్ చేసిన ఫోటోల‌లో సూప‌ర్ స్టార్ లుక్ చాలా కూల్‌గా ఉంది. యంగ్ లుక్‌లో క‌నిపిస్తూ.. త‌న‌యుడు గౌత‌మ్‌కి స‌వాల్ విసురుతున్న‌ట్టుగా అనిపిస్తుంది. తాజాగా మ‌హేష్ లుక్‌ని చూసి ఫ్యాన్స్ నోరెళ్ళ‌పెడుతున్నారు. రోజురోజుకి ఇంత యంగ్‌గా ఎలా మారుతున్నారు. మాకు ఆ టిప్స్ చెప్పండి అని ఫ్యాన్స్ మ‌హేష్‌ని కోరుతున్నారు. మ‌హేష్ త్వ‌ర‌లో ప‌ర‌శురాంతో క‌లిసి క్రేజీ ప్రాజెక్ట్ చేయ‌నున్నాడు.


logo