గురువారం 04 జూన్ 2020
Cinema - Feb 07, 2020 , 23:50:05

ద్విపాత్రాభినయంలో మహేష్‌బాబు?

ద్విపాత్రాభినయంలో మహేష్‌బాబు?

ఇటీవల విడుదలైన ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రంతో మంచి విజయాన్ని అందుకున్నారు మహేష్‌బాబు.  ఆయన తదుపరి సినిమా గురించి ఆసక్తికరమైన వార్తలు వెలువడుతున్నాయి. వంశీపైడిపల్లి దర్శకత్వంలో దిల్‌రాజు నిర్మాతగా మహేష్‌బాబు తదుపరి సినిమా చేయబోతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన స్క్రిప్ట్‌ను సిద్ధం చేసే పనిలో ఉన్నారు వంశీపైడిపల్లి. ఇందులో మహేష్‌బాబు ద్విపాత్రాభినయంలో నటించనున్నారని తెలుస్తున్నది. పూర్తి వైరుధ్యమున్న రెండు భిన్న పాత్రల్లో ఆయన కనిపిస్తారని అంటున్నారు. గ్యాంగ్‌స్టర్‌గా ఓ పాత్ర ఉంటుందని సమాచారం. ఈ చిత్రాన్ని ఈ వేసవిలో  సెట్స్‌మీదకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలిసింది.

logo