మంగళవారం 26 మే 2020
Cinema - May 22, 2020 , 14:59:44

బ‌య‌ట అడుగుపెడితే మాస్క్ త‌ప్పనిసరి: మ‌హేష్‌

బ‌య‌ట అడుగుపెడితే మాస్క్ త‌ప్పనిసరి: మ‌హేష్‌

క‌రోనా వ‌ణికిస్తున్న‌ప్ప‌టి నుండి మ‌హేష్ త‌న సోష‌ల్ మీడియా ద్వారా నెటిజ‌న్స్‌తో పాటు త‌న అభిమానుల‌ని అప్ర‌మ‌త్తం చేస్తూనే ఉన్నాడు. తాజాగా  మాస్క్ ధరించి ఫోట్ షేర్ చేసిన మ‌హేష్‌...ఇప్పుడిప్పుడే మ‌నం క‌రోనా బారి నుండి త‌ప్పించుకుంటున్నాం. బ‌య‌ట‌కి వెళ్ళేటప్పుడు త‌ప్పనిస‌రిగా మాస్క్ ధ‌రించాలి. ఇందువ‌ల‌న మ‌న‌తో పాటు మ‌న చుట్టు ఉన్న‌వారిని కూడా కాపాడిన వార‌వుతాం అని మ‌హేష్  త‌న ట్వీట్‌లో పేర్కొన్నారు.

ఇక మ‌రో ట్వీట్‌లో మాస్క్ ధ‌రించడం కొద్దిగా ఇబ్బందిగా ఉండొచ్చు. కాని ఇలాంటి ప‌రిస్థితుల‌లో మాస్క్ ధ‌రించడం త‌ప్ప‌దు.  పాత రోజులు తిరిగి పొందాలంటే మాస్క్ ధ‌రించ‌డం ఒక్క‌టే మ‌న‌కి మార్గం అని మ‌హేష్ సామాజిక స‌ల‌హాలు ఇస్తున్నారు.


logo