సోమవారం 03 ఆగస్టు 2020
Cinema - Jul 02, 2020 , 23:53:12

ట్విటర్‌లో దూకుడు

ట్విటర్‌లో దూకుడు

తెలుగు చిత్రసీమలో తిరుగులేని అభిమానగణం కలిగిన కథానాయకుల్లో మహేష్‌బాబు ఒకరు. యువతతో పాటు ఫ్యామిలీ ఆడియెన్స్‌లో ఆయనకు మంచి ఫాలోయింగ్‌ ఉంది. తాజాగా మహేష్‌బాబు సోషల్‌మీడియా ట్విటర్‌లో సరికొత్త రికార్డును సొంతం చేసుకున్నారు. కోటిమంది ఫాలోవర్స్‌ను సంపాదించుకున్న తొలి దక్షిణాది హీరోగా నిలిచారు. 9.1 మిలియన్ల ఫాలోవర్స్‌తో తమిళ కథానాయకుడు ధనుష్‌ రెండోస్థానంలో ఉన్నారు. మహేష్‌బాబు సాధించిన సరికొత్త ఫీట్‌ పట్ల ఆయన అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కమర్షియల్‌ విజయాలతో పాటు తిరుగులేని ఛరిష్మా తోడుగా తమ హీరో తారాపథంలో దూసుకుపోతున్నాడని కొనియాడుతున్నారు. ప్రస్తుతం మహేష్‌బాబు ‘సర్కారు వారి పాట’ అనే సినిమా కోసం సిద్ధమవుతున్నారు. పరశురామ్‌ దర్శకత్వం వహిస్తారు.


logo