బుధవారం 03 జూన్ 2020
Cinema - May 10, 2020 , 10:44:10

మహేష్ నిర్మాణంలో విజ‌య్, కార్తీ..

మహేష్ నిర్మాణంలో  విజ‌య్, కార్తీ..

ఒక‌వైపు హీరోగా సినిమాలు చేస్తూనే మ‌రోవైపు నిర్మాత‌గా వ‌రుస చిత్రాలు రూపొందిస్తున్నారు మ‌హేష్ బాబు. త్వ‌ర‌లో ప‌ర‌శురాంతో క‌లిసి క్రేజీ ప్రాజెక్ట్ చేయ‌నున్న మ‌హేష్ మ‌రోవైపు విజ‌య్ దేవ‌ర‌కొండ‌, కార్తీ వంటి స్టార్ హీరోస్‌తో సినిమాలు నిర్మించ‌నున్న‌ట్టు తెలుస్తుంది. 

ప్రస్తుతం మ‌హేష్ బాబు అడివి శేష్ హీరోగా 'మేజర్' సినిమాను నిర్మిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా చాలావరకూ చిత్రీకరణ జరుపుకుంది. దీని త‌ర్వాత‌ మహేష్ విజయ్ దేవరకొండ హీరోగా మరో సినిమాను నిర్మించనున్నట్టు సమాచారం. ఇప్ప‌టికే విజ‌య్‌తో చ‌ర్చ‌లు కూడా పూర్తైన‌ట్టు తెలుస్తుంది. విజ‌య్ సినిమా పూర్తైన వెంట‌నే కార్తీతో క‌లిసి సినిమా నిర్మించ‌డానికి స‌న్నాహాలు చేస్తున్న‌ట్టు టాక్స్ వినిపిస్తున్నాయి. మొత్తానికి మీడియం బడ్జెట్‌తో  చిత్రాలు నిర్మిస్తున్న మ‌హేష్ రానున్న రోజుల‌లో భారీ బ‌డ్జెట్ చిత్రాలు తీసిన ఆశ్చ‌ర్య‌పోన‌వ‌స‌రం లేదు.


logo