ఆదివారం 25 అక్టోబర్ 2020
Cinema - Mar 15, 2020 , 22:49:12

ఏప్రిల్‌లో షురూ

ఏప్రిల్‌లో షురూ

‘సరిలేరు నీకెవ్వరు’తో సంక్రాంతికి  పెద్ద విజయాన్ని అందుకున్నారు మహేష్‌బాబు. ఈ సినిమా తర్వాత ఆయన పరశురామ్‌ దర్శకత్వంలో ఓ చిత్రాన్ని చేయబోతున్నారు. కుటుంబ విలువలకు వినోదాన్ని మేళవిస్తూ సినిమాల్ని రూపొందించిన పరశురామ్‌ తన పంథాకు భిన్నంగా  తొలిసారి  థ్రిల్లర్‌ కథాంశంతో ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నట్లు చెబుతున్నారు.  గత చిత్రాలకు పూర్తి భిన్నంగా మహేష్‌  పాత్ర సరికొత్త కోణంలో సాగనున్నట్లు తెలిసింది.  మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించనున్నట్లు తెలిసింది.  ఏప్రిల్‌లో లాంఛనంగా ఈ చిత్రాన్ని ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. 


logo