మహేష్‌బాబు స్మార్ట్, ైస్టెలిష్లుక్ సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. ఫార్మల్ డ్రెస్‌లో ఆయన యంగ్‌లుక్‌లో కనిపిస్తున్నారు. ఈ ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్న మహేష్‌బాబు ‘మరో సరదా షూట్’ అంటూ వ్యాఖ్యానించారు. ఈ కొత్తలుక్‌లో అభిమానుల్ని విశేషంగా ఆకట్టుకుంటోంది. నేడు మహేష్‌బాబు జన్మదినం. ఈ సందర్భంగా ఆయన కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘సర్కారువారి పాట’ టీజర్‌ను విడుదల చేయబోతున్నారు. పరశురామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది జనవరిలో ప్రేక్షకులముందుకురానుంది.