శుక్రవారం 05 జూన్ 2020
Cinema - Mar 14, 2020 , 07:53:34

బిగ్ బాస్ 4 హోస్ట్‌గా సూప‌ర్ స్టార్..!

బిగ్ బాస్ 4 హోస్ట్‌గా సూప‌ర్ స్టార్..!

బుల్లితెర బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్ కార్య‌క్ర‌మం అన్ని ప్రాంతీయ భాష‌ల‌లో స‌క్సెస్ ఫుల్ టీఆర్పీలు పొందుతున్న సంగ‌తి తెలిసిందే. ముఖ్యంగా తెలుగులో బిగ్ బాస్ షో బుల్లితెర ప్రేక్ష‌కుల‌ని ఎంత‌గానో ఆక‌ట్టుకుంటుంది. తొలి సీజ‌న్‌నే ఎన్టీఆర్ ఎంతో ర‌క్తిక‌ట్టించ‌డంతో ప్రేక్ష‌కుల‌లో దీనిపై ఆస‌క్తి పెరిగింది. రెండో సీజ‌న్‌లో నాని, మూడో సీజ‌న్‌లో నాగార్జున కూడా షోని మ‌రింత ఆస‌క్తిక‌రంగా మ‌లిచారు. 

జూలైలో ప్ర‌సారం బిగ్ బాస్ సీజ‌న్ 4 కార్య‌క్ర‌మానికి హోస్ట్‌గా ఎవ‌రు ఉంటార‌నే దానిపై ప్ర‌స్తుతం టాలీవుడ్ ఇండ‌స్ట్రీలో హాట్ హాట్ చ‌ర్చ‌లు న‌డుస్తున్నారు. నిర్వాహ‌కులు ఇప్ప‌టికే ఎన్టీఆర్‌ని సంప్ర‌దించిన‌ప్ప‌టికీ ఆయ‌న ఉన్న బిజీ షెడ్యూల్ కార‌ణంగా నో చెప్పార‌ట‌. దీంతో ఈ సారి కొత్త‌గా సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబుని హోస్ట్‌గా తీసుకోవాల‌ని భావిస్తున్నార‌ట‌. బుల్లితెర‌పై కనిపించేందుక మ‌హేష్ బాబు కూడా ఆస‌క్తి క‌న‌బ‌రుస్తున్న నేప‌థ్యంలో సీజన్ 4ని మ‌హేష్ హోస్ట్ చేయ‌డం ప‌క్కా అని నెటిజ‌న్స్ ముచ్చ‌టించుకుంటున్నారు. దీనిపై క్లారిటీ మ‌రికొద్ది రోజుల‌లో రానుంది. 


logo