శనివారం 06 జూన్ 2020
Cinema - May 17, 2020 , 23:16:53

మహేష్‌ నయా లుక్‌

మహేష్‌ నయా లుక్‌

ప్రస్తుతం లాక్‌డౌన్‌ టైమ్‌ను కుటుంబంతో పరిపూర్ణంగా ఆస్వాదిస్తున్నారు మహేష్‌బాబు. కుమార్తె సితార, తనయుడు గౌతమ్‌లతో ఆనందంగా కాలాన్ని గడుపుతున్నారు. వారి హంగామా తాలూకు ఫొటోలు సోషల్‌మీడియాలో అభిమానుల్ని ఆకట్టుకుంటున్నాయి. తాజాగా సితార, గౌతమ్‌లతో మహేష్‌ దిగిన ఓ ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో నమ్రత పోస్ట్‌ చేసింది. ఇందులో క్లీన్‌షేవ్‌తో కళ్లద్దాలు ధరించి నయా అవతారంలో మహేష్‌ కనిపిస్తున్నారు ఈ కొత్త లుక్‌ వైరల్‌గా మారింది.   ‘సరిలేరునీకెవ్వరు’తో  సంక్రాంతికి ప్రేక్షకుల్ని పలకరించారు మహేష్‌బాబు.  ఈ సినిమా తర్వాత పరశురామ్‌ దర్శకత్వంలో ఓ చిత్రానికి గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చారాయన. logo