టాలీవుడ్ (Tollywood) లో ఎలాంటి పాత్రలైనా చేయదగ్గ అరుదైన నటులలో మహేష్ బాబు (Mahesh Babu) కూడా ఒకరు. అందుకే ఆయనకు అరడజనుకు పైగా నంది అవార్డులు వచ్చాయి. ఇక ఫిలింఫేర్ అవార్డులకు లెక్కలేదు. అంతటి అద్భుతమైన నటుడు అయినా కూడా తనను తాను కొన్ని పాత్రలకే పరిమితం చేసుకుంటున్నాడు మహేష్ బాబు. ఇది చాలా సంవత్సరాలుగా అందరూ అంటున్న మాట. కొన్ని విలక్షణ పాత్రలకు మహేష్ బాబు ఎప్పుడూ దూరంగానే ఉంటున్నాడు. ఇది ఆయనపై ఉన్న ప్రధాన విమర్శ. నటుడిగా అంత అద్భుతమైన ట్రాక్ రికార్డు ఉన్న మహేష్ కొన్ని పాత్రలకు పరిమితం అవుతున్నాడు అంటూ ఆయనను చాలా మంది అడుగుతున్నారు. మరీ ముఖ్యంగా పౌరాణిక, చారిత్రాత్మక పాత్రలు చేయడానికి అసలు ముందుకు రావడం లేదు మహేష్ బాబు.
ఈ విషయంలో గుణశేఖర్ ఇంతకుముందు ఒకసారి ట్రై చేశాడు. రుద్రమదేవి సినిమాలో గోన గన్నారెడ్డి పాత్రకు మహేష్ బాబును ఎంచుకున్నాడు ఆయన. తనతో మూడు సినిమాలు చేశాడు అని కృతజ్ఞతతో మహేష్ బాబు కూడా ముందు ఈ పాత్రపై ఆసక్తి చూపించాడు. కానీ చివరి నిమిషంలో గోన గన్నారెడ్డి నుంచి తప్పుకున్నాడు. తరువాత ఇదే పాత్రను అల్లు అర్జున్ పారితోషికం లేకుండా చేశాడు. ఆ తర్వాత ప్రతాప రుద్రుడు పాత్ర కోసం కూడా మరోసారి మహేష్ ని అనుకున్నాడు గుణశేఖర్. దానికి కూడా ఆయన నో చెప్పాడు. ఇదిలా ఉంటే ఇప్పుడు అల్లు అరవింద్ నిర్మాతగా 1000 కోట్లతో మూడు భాగాలుగా రామాయణం సినిమాను నిర్మించబోతున్నారు. ఈ భారీ ప్రాజెక్టులో అల్లు అరవింద్ కు తోడుగా మరో ఇద్దరు నిర్మాతలు కూడా ఉన్నారు.
ఇందులో రాముడి పాత్ర ( Ramudu Role) కోసం మహేష్ బాబుని తీసుకుంటే బాగుంటుందని చాలా రోజుల నుంచి సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఇది మహేష్ కు కూడా తెలియని విషయం కాదు. ఈ సినిమాను దంగల్ దర్శకుడు నితీష్ తివారి చేతిలో పెడుతున్నారు. ఇందులో టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ ఇలా అన్ని భాషల యాక్టర్లు నటించబోతున్నారు. ప్రధాన పాత్ర కోసం మహేష్ బాబును తీసుకోవాలని ఎంత ప్రయత్నిస్తున్నా ఆయన మాత్రం దూరంగానే ఉంటున్నాడు. ఎందుకో తెలియదు కానీ కెరీర్ మొదటి నుంచి కూడా పౌరాణిక, చారిత్రాత్మక పాత్రలకు దూరంగా ఉంటున్నాడు సూపర్ స్టార్.
ఇప్పుడు కూడా ఇదే చేయబోతున్నాడు. అసలు ఎందుకు మహేష్ అలాంటి క్యారెక్టర్ చేయకూడదు అని ముందుగానే ఫిక్స్ అయ్యాడో ఎవరికీ అర్థం కావడం లేదు. లేదంటే అలాంటి పాత్రలో అభిమానులు తనను చూడడానికి ఇష్టపడడం లేదని నిర్ణయించుకున్నాడా అనేది కూడా తెలియడం లేదు. కారణం ఏదైనా కూడా మహేష్ మాత్రం ఒక జోనర్ ఆఫ్ సినిమాలకు దూరంగా ఉన్నాడు. మరి ఈ నిర్ణయం ఆయన ఎప్పుడు మార్చుకుంటాడో చూడాలి.. అసలు మార్చుకుంటాడా అనేది కూడా అనుమానమే.
ఇవి కూడా చదవండి..
Friday New Movies | శుక్రవారం సందడి..ఆగస్ట్ 6న 7 సినిమాలు రిలీజ్
Chiranjeevi | చిరంజీవి గొప్ప మనసుపై అసిస్టెంట్ డైరెక్టర్ ఏమన్నారంటే…?
Karan Johar Fear| భయపడుతున్న బాలీవుడ్ దర్శకుడు