శుక్రవారం 07 ఆగస్టు 2020
Cinema - Jul 02, 2020 , 14:47:09

ఆ ఘ‌న‌త సాధించిన ఒకే ఒక్క‌డు మ‌హేష్‌..!

ఆ ఘ‌న‌త సాధించిన ఒకే ఒక్క‌డు మ‌హేష్‌..!

సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబుకి రికార్డులు కొత్తేమి కాదు. ఆయ‌న న‌టించిన ఎన్నో సినిమాలు సూప‌ర్ డూప‌ర్ హిట్ సాధించ‌డంతో పాటు బాక్సాఫీస్ ద‌గ్గ‌ర భారీ వ‌సూళ్లు రాబ‌ట్టాయి. ఇక సోష‌ల్ మీడియాలోను మ‌హేష్ ప్ర‌భంజ‌నం సృష్టిస్తున్నాడు. ట్విట్ట‌ర్, ఇన్‌స్టాగ్రామ్‌ల‌లో ఎక్కువగా యాక్టివ్‌గా ఉంటూ వ‌స్తున్న మ‌హేష్ తాజాగా త‌న ట్విట్ట‌ర్ ఫాలోవ‌ర్స్ సంఖ్య‌ని ప‌ది మిలియ‌న్స్‌కి పెంచుకున్నాడు. అంటే ఇప్పుడు ఆయ‌న‌ని ఫాలో అయ్యే వారి సంఖ్య కోటి. 

సౌత్ ఇండియాలో ఏ స్టార్‌కి ట్విట్ట‌ర్‌లో కోటి ఫాలోవ‌ర్స్ లేక‌పోవ‌డంతో, ఈ ఘ‌నత సాధించిన  ఏకైన సౌత్ ఇండియా స్టార్ మహేష్ కావడం విశేషం. మ‌హేష్ త‌న ట్విట్ట‌ర్‌లో సినిమా అప్‌డేట్స్‌తో పాటు ఫ్యామిలీకి సంబంధించిన అప్‌డేట్స్ కూడా త‌ర‌చు ఇస్తుంటారు. అలానే సామాజిక అంశాల‌ని కూడా ఇందులో ప్ర‌స్తావిస్తూ ఉంటారు. లాక్‌డౌన్ స‌మ‌యంలో క‌రోనాపై అవ‌గాహ‌న పెంచేలా ప‌లు విష‌యాలు మాట్లాడిన మ‌హేష్ , త‌న పిల్ల‌ల‌తో స‌ర‌దాగా గ‌డిపిన క్ష‌ణాల‌కి సంబంధించిన వీడియోలు కూడా షేర్ చేశారు. 

సినిమాల విష‌యానికి వ‌స్తే మ‌హేష్ తన నెక్స్ట్ మూవీ దర్శకుడు పరుశురాం తో చేస్తున్నారు . సర్కారు వారి పాట టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ మూవీ షూటింగ్ ఈ ఏడాది చివర్లో మొదలుకానుంది. మైత్రి మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్ మరియు జి ఎమ్ బి ఎంటర్టైన్మెంట్స్ కలిసి నిర్మిస్తున్నాయి. కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుండగా థమన్ సంగీతం అందిస్తున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డోన్‌లోడ్ చేసుకోండి.


logo