సోమవారం 18 జనవరి 2021
Cinema - Nov 29, 2020 , 12:02:57

ఇండ‌స్ట్రీలో 41 ఏళ్ళు పూర్తి చేసుకున్న మ‌హేష్ బాబు

ఇండ‌స్ట్రీలో 41 ఏళ్ళు పూర్తి చేసుకున్న మ‌హేష్ బాబు

త‌న తండ్రి కృష్ణ న‌ట వార‌స‌త్వాన్ని పుణికి పుచ్చుకొని టాలీవుడ్ నెంబ‌ర్ 1 హీరోగా ఎదిగాడు మ‌హేష్ బాబు. 1999లో రాజ‌కుమారుడు సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చారు. కాని అంత‌క‌ముందు బాల న‌టుడిగా ప‌లు చిత్రాలు చేశారు. మ‌హేష్ మొట్ట‌మొద‌టి సారిగా నీడ అనే చిత్రంతో కెమెరా ముందుకు వ‌చ్చారు. దాస‌రి నారాయ‌ణ‌రావు నిర్మాణంలో రూపొందిన ఈ చిత్రం నవంబ‌ర్ 29,1979న విడుద‌ల కాగా, నేటితో 41 ఏళ్లు పూర్తి చేసుకుంది.

నీడ చిత్రం న‌టుడిగా మ‌హేష్‌కు తొలి చిత్రం కాగా, ఆయ‌న ఇండ‌స్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన 41 ఏళ్లు అవుతుంది.ఈ సంద‌ర్భంగా సూపర్ స్టార్ మ‌హేష్‌ అభిమానులు సోషల్ మీడియాలో # 41YrsOfSSMBMasteryInTFI అనే హ్యాష్‌ట్యాగ్‌ను  ఫుల్‌గా ట్రెండ్ చేస్తూ  ఈ ప్రత్యేక దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. నీడ చిత్రంలో మ‌హేష్ అన్న‌య్య ర‌మేష్ బాబు ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించారు. ఇది ఆయ‌న‌కు రెండవ చిత్రం. కాగా, మ‌హేష్ ఈ ఏడాది సరిలేరు నీకెవ్వ‌రు చిత్రంతో ప్రేక్ష‌కుల ముందుకు రాగా, వ‌చ్చే ఏడాది స‌ర్కారు వారి పాట‌తో ప‌ల‌క‌రించ‌నున్నాడు. జ‌న‌వరి నుండి ఈ చిత్ర షూటింగ్ ప్రారంభం కానుంది.