తెలుగు ఇండస్ట్రీలో నెంబర్ వన్ పీఠం కోసం పోటీ పడుతున్న హీరోల్లో పవన్, మహేష్ బాబు ముందుంటారు. పవన్ కళ్యాణ్ ఏడాది కింది వరకు కూడా వరస సినిమాలు చేయలేదు. రెండు మూడేళ్లకో సినిమా చేశాడు. కానీ ఇప్పుడు ఆయన చేతిలో మూడు సినిమాలు ఉన్నాయి. మరోవైపు మహేష్ బాబు కూడా తన జోరు చూపిస్తున్నాడు. ఏడాదికి కనీసం ఒక సినిమా విడుదల చేస్తున్నాడు. దాంతో ఈ ఇద్దరి మధ్య పోటీ కూడా అలాగే ఉంది. ఇటీవల ఈ ఇద్దరూ బాక్సాఫీస్ దగ్గర పోటీ పడటానికి కూడా సిద్ధమయ్యారు. సర్కార్ వారి పాట, హరిహర వీరమల్లు సినిమాలు వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కానున్నట్లు దర్శక నిర్మాతలు కూడా అధికారికంగా ప్రకటించారు. కానీ ఇప్పుడు బాక్సాఫీస్ వద్ద ఆ పోటీ లేదనే తెలుస్తోంది.
మహేష్ బాబు నటిస్తున్న సర్కారు వారి పాట సినిమా సంక్రాంతి సందర్భంగా విడుదల అవుతుందని దర్శక నిర్మాతలే ప్రకటించారు. అది వచ్చిన కొన్ని రోజులకు పవన్ నటిస్తున్న హరిహర వీరమల్లు సినిమా సైతం 2022 సంక్రాంతికే వస్తుందని అనౌన్స్ చేశారు. క్రిష్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాను ఏఎం రత్నం నిర్మిస్తున్నాడు. 100 కోట్లకు పైగా బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతుంది. అయితే ప్రస్తుతం వస్తున్న సమాచారం ప్రకారం పవన్, మహేష్ బాబు బాక్సాఫీస్ పోరు క్యాన్సిల్ అయిపోయింది. మహేష్ బాబు సర్కారు వారి పాట అనుకున్న దాని కంటే మూడు నెలలు ముందుగానే వస్తుందని తెలుస్తుంది. అయితే కరోనా కారణంగా షూటింగ్ అనుకున్నట్లుగా సాగడం లేదు. అయినా కూడా మహేష్ ఎలాగోలా ఈ సినిమాను ముందు పూర్తి చేయాలని చూస్తున్నాడు. 2022 వరకు ఆగకుండా.. 2021 చివర్లోనే సినిమాను విడుదల చేయాలని చూస్తున్నాడు.
మరోవైపు కరోనా ఉన్నా.. ఏమున్నా కూడా తమ సినిమా మాత్రం సంక్రాంతికే వస్తుందని కన్ఫర్మ్ చేశాడు పవన్ హరిహర వీరమల్లు నిర్మాత ఏఎం రత్నం. దాంతో పవన్ వర్సెస్ మహేష్ పోరు కాస్తా క్యాన్సిల్ అయిపోయింది. అయితే పవన్ కళ్యాణ్ తో మహేష్ బాబు పోరు నుంచి తప్పుకున్నా బాలయ్య ఎంట్రీ ఇచ్చేలా కనిపిస్తున్నాడు. గోపీచంద్ మలినేనితో ఈయన చేయబోయే సినిమాను సంక్రాంతి విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
మరో రీమేక్ పై కన్నేసిన వెంకటేశ్..?
కలలు రియాలిటీ కన్నా బాగున్నపుడు..రాశీఖన్నా స్టిల్ వైరల్
సౌందర్య శర్మ స్టిల్స్ కు నెటిజన్లు ఫిదా
వెంటిలేటర్ బెడ్ కావాలి..భూమి విజ్ఞప్తికి నెటిజన్ల స్పందన
ఆక్సిజన్ ను ఇలా మెరుగుపర్చుకోండి..నోరాఫతేహి టిప్
కరోనాతో కన్నుమూసిన ప్రముఖ హీరోయిన్ సోదరుడు..!
పవన్ కళ్యాణ్ హెల్త్‌పై తాజా అప్డేట్..!