ఆదివారం 25 అక్టోబర్ 2020
Cinema - Oct 03, 2020 , 11:37:04

డ్యూయ‌ల్ రోల్‌లో మ‌హేష్‌.. అభిమానుల‌కి పండగే

డ్యూయ‌ల్ రోల్‌లో మ‌హేష్‌.. అభిమానుల‌కి పండగే

సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు ఈ ఏడాది స‌రిలేరు నీకెవ్వ‌రు చిత్రంతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రంలో మ‌హేష్ ఆర్మీ ఆఫీస‌ర్‌గా క‌నిపించి అభిమానులని అల‌రించాడు. ఇక త‌న తాజా ప్రాజెక్టులో భాగంగా ప‌ర‌శురాంతో క‌లిసి స‌ర్కారు వారి పాట అనే చిత్రాన్ని చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్‌కు క‌రోనా బ్రేక్ వేసింది. క‌రోనా ఉదృతి త‌గ్గాకే షూటింగ్ మొద‌లు పెడ‌దామని మ‌హేష్ చెప్పిన‌ట్టు తెలుస్తుంది.  అయితే క‌రోనా మొద‌లైన‌ప్ప‌టి నుండి ఇంటికే ప‌రిమిత‌మైన మ‌హేష్ ఓ యాడ్ షూటింగ్‌లో పాల్గొన్నాడు. 

'ఫ్లిప్‌కార్ట్ ది బిగ్‌ బిల్లియన్‌ డేస్‌' షురూ అయినట్లుగా చెబుతూ మ‌హేష్ పై ఓ యాడ్‌ని చిత్రీక‌రించారు. ఇందులో మ‌హేష్ రెండు పాత్ర‌ల‌లో క‌నిపించారు. అన్న‌య్యగా , త‌మ్ముడిగా క‌నిపించి సంద‌డి చేశాడు. రెండు పాత్ర‌ల‌లోను మ‌హేష్ హ్యాండ్స‌మ్ లుక్‌లో క‌నిపిస్తూ అమ్మాయిల మ‌న‌సుల‌ని దోచుకుంటున్నాడు. logo