ఆదివారం 09 ఆగస్టు 2020
Cinema - Jul 16, 2020 , 19:51:06

"ముహమ్మద్" సినిమాపై నిషేధం

ముంబై : వివాదాస్పద చిత్రం "ముహమ్మద్, దేవుని దూత" విడుదలను మహారాష్ట్ర ప్రభుత్వం గురువారం నిషేధించింది. డాన్ సినిమా పోర్టల్ మూసివేయాలని కూడా ప్రభుత్వం ఆదేశించింది. రాజా అకాడమీ ఈ చిత్రాన్ని "దైవదూషణ" అని పేర్కొంటూ.. సినిమాను విడుదల చేయకుండా నిలిపివేయాలని కోరిన కొద్ది రోజులకే మహారాష్ట్ర ప్రభుత్వం ఈ చిత్రంపై నిషేధం విధించింది.

ఈ చిత్రం మతపరమైన మనోభావాలను దెబ్బతీస్తున్నదని, తగు చర్యలు తీసుకోవాలంటూ బుధవారం మహారాష్ట్ర హోంమంత్రి అనిల్ దేశ్ ముఖ్.. కేంద్రానికి లేఖ రాశారు. మజిద్ మజిది దర్శకత్వం ఈ చిత్రం జూలై 21 న ఆన్‌లైన్‌లో విడుదల కావాల్సి ఉన్నది. మతపరమైన మనోభావాలకు హాని కలిగించే ఈ చిత్రం విడుదల కానున్న డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లను కూడా బ్లాక్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం బుధవారం కేంద్రాన్ని కోరింది. ఈ సినిమా విడుదలను నిషేధించడానికి యూట్యూబ్, ఫేస్‌బుక్, ట్విట్టర్, టెలిగ్రామ్, వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్, స్నాప్‌చాట్ వంటి అన్ని డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లకు సూచనలు / ఆదేశాలు జారీ చేయాలని కూడా అభ్యర్థించారు.


logo