బుధవారం 03 జూన్ 2020
Cinema - May 04, 2020 , 14:00:21

వివాదంలో పాప్ సింగ‌ర్.. పార్టీలో హ‌ల్ చ‌ల్‌

వివాదంలో పాప్ సింగ‌ర్.. పార్టీలో హ‌ల్ చ‌ల్‌

ప్రపంచ వ్యాప్తంగా వీరాభిమానులున్న 61 ఏళ్ల  అమెరికన్ గాయని మ‌డోన్నా రీసెంట్‌గా.. నన్ను కరోనా ఏమీ చేయదు. ఎందుకంటే నాలో యాంటీ బాడీస్ ఉన్నాయి . డాక్టర్ పరీక్షించారు. నా బాడీలో ప్రతిరోధకాలు (యాంటీబాడీస్) ఉన్నాయని తెలుసుకున్నాను అంటూ సెన్సేషనల్ ప్రకటన చేసిన సంగ‌తి తెలిసిందే. అయితే తాజాగా ఈ అమ్మ‌డు ప్రముఖ ఫోటోగ్రాఫర్ స్టీవెన్ క్లీన్ పుట్టినరోజు పార్టీకి హాజరైంది. ఆ పార్టీలో సామాజిక దూరాన్ని మ‌రిచి కౌగిలించుకోవ‌డం, ప‌క్క‌నే నిలుచోవ‌డం చేసింది. ఈ నేప‌థ్యంలో నెటిజ‌న్స్ ఆమెపై మండిప‌డ్డారు

న్యూయార్క్‌లో జ‌రిగిన బ‌ర్త్‌డే పార్టీకి మ‌డోన్నాతో పాటు మ‌రో న‌లుగురు హాజ‌ర‌య్యారు . ఇందులో ఎవ‌రు మాస్క్‌లు ధ‌రించ‌లేదు.  సామాజిక దూరం పాటించ‌లేదు. ఈ నేప‌థ్యంలో నెటిజ‌న్స్ మ‌డోన్నాపై ఫైర్ అయ్యారు. నీకు ఇద్ద‌రు చిన్న పిల్ల‌లు ఉన్నారు. ఇలా చేస్తే వారి ప‌రిస్థితి ఏంట‌ని ప్ర‌శ్నించారు. ఈ ప‌రిస్థితుల‌లో మ‌డోన్నా మేనేజ‌ర్ ..మిచెల్ ఎల్ రూయిజ్ ఒక వీడియోను షేర్ చేసి, ఆమె త‌న ఇంట్లోనే ఉంది. స్టీవెన్ బ‌ర్త్‌డే కోసం ఆమె ఇంటికి 5గురు వ‌చ్చారు. వారంద‌రు నెల రోజుల‌కి పైగా స్వీయ నిర్భందంలో ఉన్నారు. మ‌డోన్నా త‌న‌ని త‌న పిల్ల‌ల‌ని ఎప్పుడు రిస్క్‌లో పెట్టుకోదు. ద‌య చేసి ఈ పిచ్చి కామెంట్స్ ఆపండి అని క్లారిటీ ఇచ్చింది .
logo