మధురిమ.. ఈ పేరు తెలుగు ప్రేక్షకులకు కొత్తేమీ కాదు. అప్పుడప్పుడూ తెలుగు సినిమాలు చేసి.. ఇప్పుడు హిందీలో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటుంది మధురిమ. అక్కడ నైరా బెనర్జీగా పేరు మార్చుకుని అమ్మడు ఫుల్లుగా అందాలన్నీ ఆరబోస్తుంది. ఆ మధ్య వన్ నైట్ స్టాండ్ సినిమా కోసం అదిరిపోయే హాట్ సీన్స్ కూడా చేసింది నైరా. తెలుగులో కొత్తజంటలో అటు అమలాపురం అంటూ ఆడిపాడింది కదా.. టెంపర్ లో సిస్టర్ రోల్ కూడా చేసింది. దానికి ముందు కూడా కొన్ని సినిమాలు చేసినా కూడా పెద్దగా గుర్తింపు అయితే రాలేదు. ఎలాగైనా స్టార్ కావాలని చూస్తుంది మధురిమ. అందుకే అందాలనే ఆయుధంగా వాడేస్తుంది. అప్పట్లో సన్నీలియోన్ హీరోయిన్ గా నటించిన వన్ నైట్ స్టాండ్ సినిమాలో నటించింది. ఆమెతో పోటీగా అందాలను కూడా ఆరబోసింది. ఆమెతో పోటీ పడాలంటే నైరా కూడా రెచ్చిపోవాలి కదా.. అందుకే రెండు పెగ్గులు వేసుకొచ్చి సీన్స్ ఇరగదీసింది కూడా.
అయితే ఇంటికెళ్లడానికి మాత్రం భయమేసిందని అప్పట్లో చెప్పుకొచ్చింది. ఎక్కడ తమవాళ్లు కొట్టేస్తారో అని హాట్ సీన్స్ చేసినందుకు కాదు మందు కొట్టినందుకు..! ఎప్పటికప్పుడు అదిరిపోయే హాట్ షో చేస్తూ గూగుల్ ను సైతం వేడెక్కిస్తుంది మధురిమ. తాజాగా చీరకట్టులో ఉన్న ఫోటోలు వైరల్ అవుతున్నాయి. చీరలోనే ఉన్నా కూడా అదిరిపోయే అందాలను ఆరబోస్తుంది మధు. ఇంత చేస్తున్నా కూడా అవకాశాలు మాత్రం రావడం లేదు. సినిమాలు కాదు కానీ ప్రస్తుతం వెబ్ సిరీస్ లు చేస్తూ బిజీగా ఉంది మధురిమ. ముఖ్యంగా బి గ్రేడ్ వెబ్ సిరీస్ ల వైపు అడుగులు వేస్తుంది మధురిమ. అడపాదడపా వచ్చే సినిమా అవకాశాలను కూడా రెండు చేతులా అందిపుచ్చుకుంటుంది మధురిమ.