సోమవారం 19 అక్టోబర్ 2020
Cinema - Oct 17, 2020 , 13:06:06

మాధురీ దీక్షిత్, శ్రీరామ్‌ల యానివ‌ర్స‌రీ ఫోటో వైర‌ల్

మాధురీ దీక్షిత్, శ్రీరామ్‌ల యానివ‌ర్స‌రీ ఫోటో వైర‌ల్

అలనాటి అందాల తార మాధురీ దీక్షిత్ న‌ట‌న‌, డ్యాన్స్‌ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మాధురీ పాట వస్తుందంటే ఆడియెన్స్‌ కుర్చీలకు అతుక్కుపోవాల్సిందే. ఏక్ దో తీన్.., చోలీ కే పీచే.., ద‌క్ ధ‌క్ క‌ర్నే ల‌గా.., మార్ దాలా లాంటి సాంగ్స్‌తో సినీ ప్రేక్ష‌కుల‌ని థ్రిల్ చేసింది బాలీవుడ్ భామ మాధురీ దీక్షిత్. 21 ఏళ్ళ క్రితం అంటే అక్టోబ‌ర్ 1999న  శ్రీరామ్ నేనేతో ఏడ‌డుగులు వేసింది మాధురీ.

మాధురీ, శ్రీరామ్ జంట త‌మ 21 ఏళ్ల యానివ‌ర్సరీని నేడు ఘ‌నంగా జ‌రుపుకున్నారు. ట్రెడిష‌న‌ల్ డ్రెస్‌ల‌ని ధరించి  ప‌లు ఫోటోలు దిగిన ఈ జంట ఆ ఫోటోల‌ని సోష‌ల్ మీడియాలో షేర్ చేస్తూ ఒకరికి ఒక‌రు శుభాకాంక్ష‌లు తెలుపుకున్నారు. ప్ర‌స్తుతం మాధురీ-శ్రీరామ్‌ల జంట‌కు సంబంధించిన ఫోటో సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతుండ‌గా, త‌మ ఆరాధ్య న‌టీమ‌ణిని చూసిన అభిమానులు తెగ మురిసిపోతున్నారు. logo