బుధవారం 08 జూలై 2020
Cinema - Jun 06, 2020 , 10:20:59

త‌న పెళ్ళిపై క్లారిటీ ఇచ్చిన మాధ‌వీ ల‌త‌

త‌న పెళ్ళిపై క్లారిటీ ఇచ్చిన మాధ‌వీ ల‌త‌

నచ్చావులే' సినిమాతో తెలుగు ప్రేక్ష‌కులకి ద‌గ్గ‌రైన భామ‌ మాధవీలత. మహేష్ బాబు హీరోగా రూపొందిన ‘అతిథి’ సినిమాతో పాటు నాని హీరోగా వచ్చిన 'స్నేహితుడా' సినిమాతో తెలుగు ప్రేక్ష‌కుల‌కి ద‌గ్గ‌రైంది. ఇటీవ‌లి కాలంలో స‌రైన ఆఫ‌ర్స్ రాక‌పోవ‌డంతో రాజ‌కీయాల‌లోకి వెళ్ళింది. తాజాగా త‌న సోష‌ల్ మీడియాలో ..  ‘చాలా నెలల తరవాత నేను  సంతోషంగా ఉన్నాను. కొత్త జీవితం మొదలైంది. అద్భుతం జ‌రిగింది. త్వరలోనే ప్రకటన చేస్తాను’’ అని మాధవీలత  పెట్టిన పోస్ట్‌ సంచలనంగా మారింది. 

మాధ‌వీ ల‌త పోస్ట్‌తో సోష‌ల్ మీడియాలో ఆస‌క్తిక‌ర చ‌ర్చ మొద‌లైంది. ఈ భామ త్వ‌ర‌లో పెళ్లిపీట‌లెక్కుతుంద‌ని ప్ర‌చారం చేశారు. మాధ‌వీల‌త స‌న్నిహితులు ఆమెకి శుభాకాంక్ష‌లు కూడా తెలియ‌జేశారు. ఈ నేప‌థ్యంలో స్పందించిన మాధ‌వీ.. ఇందులో ఏ మాత్రం నిజం లేదు. నా పెళ్ళి ఇప్ప‌ట్లో ఉండ‌దు. అందరు శుభాకాంక్ష‌లు చెబుతుంటే న‌వ్వు వ‌స్తుంది. ఇంట్లో సంబంధాలు చూస్తున్నారు. అన్నీ కుదిరితే  2021లో పెళ్లి చేసుకుంటాన‌ని అంటుంది మాధ‌వీల‌త‌.


logo