ఇస్రో శాస్త్రవేత్త నంబి నారాయణన్ బయోపిక్ ‘రాకెట్రీ..ది నంబి ఎఫెక్ట్’. కోలీవుడ్ స్టార్ హీరో మాధవన్ కీ రోల్ లో నటిస్తున్నాడు. తెలుగు, తమిళం, మలయాళం, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో రూపొందుతున్న ఈ చిత్రం ట్రైలర్ ను మేకర్స విడుదల చేశారు. నంబినారాయణ ఇంటర్వ్యూకు వెళ్లే సన్నివేశంతో ట్రైలర్ షురూ అయింది.
ఈ ఇంటర్వ్యూ వల్ల ఏ ఫలితం ఉండదనుకుంటే మీరెందుకని వచ్చారని నంబినారాయణన్ ను బోర్డు మెంబర్ సూర్య అడుగగా..నేనెందుకు వచ్చానా.? నాకు జరిగింది ఈ దేశంలో మళ్లీ ఎవరికి జరుగకూడదని మాధవన్ (నంబినారాయణ) చెబుతున్నాడు. నంబి నారాయణన్ తన సర్వీసులు మొదలు పెట్టిన తొలినాళ్లలో గూఢచర్యానికి పాల్పడినట్టు ఆరోపణలు రాగా..వాటి పర్యావసానాలు ఎలా ఉన్నాయనే దానిపై సస్పెన్స్ నెలకొంది.
సిమ్రన్ ఫీమేల్ లీడ్ రోల్ లో కనిపిస్తుంది. బాలీవుడ్ స్టార్ హీరో షారుక్ ఖాన్ కీ రోల్ లో నటిస్తున్నాడు. మాధవన్ లీడ్ రోల్ లో రైటర్ కమ్ డైరెక్టర్ గా, నిర్మాతగా ఈ సినిమా వస్తుండటం విశేషం.