మంగళవారం 27 అక్టోబర్ 2020
Cinema - Sep 30, 2020 , 10:15:12

పుష్ప‌లో విల‌న్‌గా మాధ‌వ‌న్..!

పుష్ప‌లో విల‌న్‌గా మాధ‌వ‌న్..!

లెక్క‌ల మాస్టారు సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో అల్లు అర్జున్, ర‌ష్మిక మంథాన ప్ర‌ధాన పాత్ర‌లుగా రూపొందుతున్న చిత్రం పుష్ప‌. పాన్ ఇండియా మూవీగా రూపొందుతున్న ఈ చిత్రాన్ని  తెలుగుతో పాటు హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో విడుదల చేయనున్నారు. కరోనా వ‌ల‌న షూటింగ్‌కు తాత్కాలిక బ్రేక్ ప‌డ‌గా, మ‌రి కొద్ది రోజుల‌లో తిరిగి షూటింగ్ మొద‌లు పెట్ట‌నున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సమకూరున్న ఈ సినిమాను ముత్తంశెట్టి మీడియాతో కలిసి మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్నారు. 

గందపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమాకు సంబంధించి ఏదో ఒక రూమ‌ర్ వ‌స్తూనే ఉంది. తాజాగా సినిమాలో విల‌న్‌గా మాధ‌వ‌న్ న‌టిస్తార‌ని పుకార్లు పుట్టుకొచ్చాయి. దీనిపై మాధ‌వ‌న్ స్వ‌యంగా స్పందించారు. పుష్ప‌లో విల‌న్‌గా న‌టిస్తున్న‌ట్టు వ‌స్తున్న వార్త‌ల‌లో ఎలాంటి నిజం లేద‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు. కాగా,ఈ సినిమాలో అల్లు అర్జున్ మేకోవర్ సైతం కొత్తగా ఉంది. అలానే ఆయ‌న స్లాంగ్ కూడా డిఫ‌రెంట్‌గా  ఉంటుంద‌ని అంటున్నారు.   


logo