శుక్రవారం 07 ఆగస్టు 2020
Cinema - Jul 07, 2020 , 10:10:30

20 ఏళ్ళ సినీ ప్ర‌స్థానం అద్భుతంగా సాగింది: మాధ‌వ‌న్

20 ఏళ్ళ సినీ ప్ర‌స్థానం అద్భుతంగా సాగింది: మాధ‌వ‌న్

తెలుగు, త‌మిళం, హిందీ  ప్రేక్ష‌కుల‌కి సుప‌రిచ‌త న‌టుడు మాధ‌వ‌న్. వైవిధ్య‌మైన పాత్ర‌ల‌లో న‌టించి అశేష ప్రేక్ష‌కాద‌ర‌ణ పొందిన మాధ‌వ‌న్ ప్ర‌స్తుతం ఒక‌ప్పుడు హీరోగా ప‌లు సినిమాలు చేశారు. ప్ర‌స్తుతం సపోర్టింగ్ క్యారెక్ట‌ర్స్ చేస్తున్నారు. 90వ ద‌శ‌కంలో ‌జీనే భీ దో యారో అనే హిందీ సీరియల్‌తో న‌టుడిగా ఆరంగేట్రం చేసిన మాధ‌వ‌న్ అనేక సీరియ‌ల్స్ త‌ర్వాత  ‘ఇన్‌ఫెర్నో’ సినిమాతో 1997లో సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టాడు.

మాధ‌వ‌న్ త‌న న‌ట జీవితంలో 20 ఏళ్ళు పూర్తి చేసుకున్న సంద‌ర్భంగా హియా చ‌ద్దా అద్భుత వీడియోని రూపొందించారు. 2 నిమిషాల క‌న్నా త‌క్కువ నిడివి ఉన్న ఈ వీడియో న‌న్ను ఎంత‌గానో ఆక‌ట్టుకుంది. నా 20 ఏళ్ళ సినీ ప్ర‌యాణం అద్భుతంగా సాగింది అని మాధ‌వ‌న్ త‌న ఇన్‌స్టాగ్రామ్ ద్వారా తెలిపారు. వాటర్‌ మిలన్‌ షుగర్‌ అని ఈ వీడియోకి పేరు పెట్ట‌గా ఇందులో బ్యాక్‌గ్రౌండ్‌లో వినిపిస్తున్న సాంగ్‌ను హారీ స్టైల్స్‌ పాడారు.  logo