తెలుగు చిత్ర పరిశ్రమలో ‘మా’ (మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్) ఎన్నికలకు రంగం సిద్ధమైంది. మా అధ్యక్ష పోటీలో నిలుస్తున్నట్లుగా ఇప్పటికే విలక్షణ నటుడు ప్రకాష్‌రాజ్ ప్రకటించిన సంగతి తెలిసిందే. కాగా తాజాగా అధ్యక్ష పోటీలో యువ కథానాయకుడు మంచు విష్ణు కూడా పోటీ చేస్తున్నట్లుగా ప్రకటించాడు. తండ్రి డా.మోహన్‌బాబు ఆశీస్సులతో పాటు సీనియర్ హీరోలు ఘట్టమనేని కృష్ణ, కృష్ణంరాజు సపోర్ట్ కోసం విష్ణు వారిని సంప్రదించారు. వారి మద్దతు కూడా విష్ణుకు లభించినట్లుగా తెలిసింది.‘మా’ సొంత భవనం ఏర్పాటు ప్రధాన ఎజెండాగా మంచు విష్ణు ఈ ఎన్నికల్లో ముందుకు వెళ్లాలని నిర్ణయించుకున్నారట.