నితిన్, నభానటేష్ జంటగా నటిస్తున్న చిత్రం ‘మాస్ట్రో’. మేర్లపాక గాంధీ దర్శకుడు. శ్రేష్ఠ్ మూవీస్ పతాకంపై ఎన్. సుధాకర్‌రెడ్డి, నిఖితారెడ్డి నిర్మిస్తున్నారు. తమన్నా కీలక పాత్రధారి. ఈ చిత్రంలోని ‘అంతులేని కళ్లలోకిలా అందమొచ్చి దూకితే ఎలా’ లిరికల్ వీడియోను శుక్రవారం విడుదల చేశారు. శ్రీజో సాహిత్యాన్ని అందించిన ఈ గీతాన్ని అనురాగ్ కులకర్ణి ఆలపించారు. మహతి స్వరసాగర్ సంగీతాన్ని సమకూర్చారు. భాను మాస్టర్ నృత్యసారథ్యంలో గోవాలోని అందమైన లొకేషన్స్‌లో నితిన్, నభానటేష్పై ఈ పాటను చిత్రీకరించారు. నిర్మాతలు మాట్లాడుతూ ‘క్రైమ్ థ్రిల్లర్ కథాంశంతో రూపొందుతున్న చిత్రమిది. ఓ పియానో ప్లేయర్ అంధుడిగా ఎందుకు నటించాల్సివచ్చింది? ఓ హత్యకు ప్రత్యక్షసాక్షిగా ఉన్న అతడికి ఎలాంటి పరిణామాలు ఎదురయ్యాయన్నది ఆసక్తికరంగా ఉంటుంది. తమన్నా నెగెటిష్ షేడ్స్‌తో కూడిన పాత్రలో కనిపిస్తుంది. త్వరలో విడుదల తేదీని ప్రకటిస్తాం’ అని తెలిపారు. జిషుసేన్‌గుప్తా, శ్రీముఖి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: జె.యువరాజ్.