గురువారం 29 అక్టోబర్ 2020
Cinema - Sep 25, 2020 , 16:03:12

బాలు గాత్రం వ‌ల్లే నా పాట‌కు జాతీయ అవార్డు : అశోక్ తేజ‌

బాలు గాత్రం వ‌ల్లే నా పాట‌కు జాతీయ అవార్డు : అశోక్ తేజ‌

హైద‌రాబాద్ : ప‌్ర‌ముఖ గాయ‌కుడు ఎస్పీ బాల‌సుబ్ర‌హ్మ‌ణ్యం మృతిప‌ట్ల ప్ర‌ముఖ గేయ ర‌చ‌యిత సుద్దాల అశోక్ తేజ తీవ్ర దిగ్ర్భాంతి వ్య‌క్తం చేశారు. బాలు మ‌హోన్న‌త‌మైన గాయ‌కుడు అని ఆయ‌న కొనియాడారు. బాలు గాత్రం వ‌ల్లే త‌న పాట‌కు జాతీయ అవార్డు వ‌చ్చింద‌ని గుర్తు చేశారు. బాలు మృతితో గేయ ర‌చ‌యిత‌లంద‌రి గొంతు మూగ‌బోయింది. వ‌ర్ధ‌మాన గేయ ర‌చ‌యిత‌ల‌ను ఆయ‌న ప్రోత్స‌హించేవారు అని అశోక్ తేజ గుర్తు చేసుకున్నారు. ఠాగూర్ చిత్రంలో అశోక్ తేజ రాసిన నేను సైతం పాట‌ను బాలు ఆల‌పించారు. ఈ పాట‌కు 2003లో జాతీయ అవార్డు వ‌చ్చింది. 


logo