బుధవారం 03 జూన్ 2020
Cinema - May 09, 2020 , 11:35:00

ల‌వ్ స్టోరీ నుండి సాయి ప‌ల్ల‌వి లుక్ విడుద‌ల‌

ల‌వ్ స్టోరీ నుండి సాయి ప‌ల్ల‌వి లుక్ విడుద‌ల‌

స్వ‌చ్ఛ‌మైన ప్రేమ‌క‌థ‌ల‌ని ఎంతో అందంగా తెర‌కెక్కించ‌డంలో దిట్ట శేఖ‌ర్ క‌మ్ముల‌.  ఫిదా, హ్యాపీడేస్, గోదావరి, ఆనంద్ లాంటి సినిమాల్లో ఎక్కడ చూసినా మనకు ప్రేమే కనిపిస్తుంది.. పాత్రల్ని అందంగా ఆవిష్కరించడమే కాదు.. అనుబంధాలు పెనవేసుకునేలా ఆయన పాత్రల చిత్ర‌ణ‌ ఉంటుంది. తాజాగా నాగ చైత‌న్య‌, సాయి ప‌ల్ల‌వి ప్ర‌ధాన పాత్ర‌లో ల‌వ్ స్టోరీ అనే చిత్రాన్ని చేస్తున్నాడు శేఖ‌ర్ క‌మ్ముల‌.  ఈ సినిమా రిలీజ్ లాక్‌డౌన్ వ‌ల‌న వాయిదా ప‌డింది.

ఇప్ప‌టికే ల‌వ్ స్టోరీ చిత్రానికి సంబంధించి టీజ‌ర్, లిరిక‌ల్ వీడియోలు విడుదల కాగా, అవి ప్రేక్ష‌కుల‌ని ఎంత‌గానో అల‌రించాయి.ఈ రోజు సాయి ప‌ల్ల‌వి బ‌ర్త్ డే సంద‌ర్భంగా నాగ చైత‌న్య త‌న ట్విట్ట‌ర్ ద్వారా ల‌వ్ స్టోరీ నుండి సాయి ప‌ల్ల‌వి లుక్‌కి సంబంధించిన పోస్ట‌ర్ విడుద‌ల చేశారు. పోస్ట‌ర్‌లో సాయిప‌ల్ల‌వి వ‌ర్షాన్ని ఎంజాయ్ చేస్తున్న‌ట్టుగా కనిపిస్తుంది. ‌


logo