శనివారం 24 అక్టోబర్ 2020
Cinema - Sep 07, 2020 , 11:42:44

తండ్రి బాట‌లో త‌న‌యుడు.. నేటి నుండి షూటింగ్ మొద‌లు

తండ్రి బాట‌లో త‌న‌యుడు.. నేటి నుండి షూటింగ్ మొద‌లు

కరోనా వ‌ల‌న గ‌త ఐదు నెల‌లుగా షూటింగ్స్ అన్నీ స్తంభించిన సంగ‌తి తెలిసిందే. ప్ర‌భుత్వం షూటింగ్స్‌కు అనుమ‌తులిచ్చిన‌ప్ప‌టికీ, ఈ మ‌హ‌మ్మారికి భ‌య‌ప‌డి స్టార్ హీరోలు ఎవ‌రు షూటింగ్స్‌ల‌లో పాల్గొన‌డం లేదు. అయితే  గ‌త వారం అక్కినేని నాగార్జున డేర్ చేసి వైల్డ్ డాగ్ మూవీ షూటింగ్‌లో పాల్గొన్నాడు. దీంతో పాటు బిగ్ బాస్ షూటింగ్‌కి హాజ‌ర‌య్యారు. ఇక‌ తండ్రిని ఇన్సిప‌రేష‌న్ తీసుకున్న త‌న‌యుడు నాగ చైత‌న్య త‌న తాజా చిత్రం ల‌వ్ స్టోరీ మూవీ షూటింగ్‌లో నేటి నుండి పాల్గొన‌నున్నాడు.

చైతూ, సాయి ప‌ల్ల‌వి ప్ర‌ధాన పాత్ర‌ల‌లో శేఖ‌ర్ క‌మ్ముల తెర‌కెక్కిస్తున్న చిత్రం ల‌వ్ స్టోరీ. 90 శాతం చిత్రం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా బ్యాలెన్స్ షూట్‌కి రెడీ అయింది. ప‌దిహేను మంది స‌భ్యుల‌తో, సింగిల్ షెడ్యూల్‌లో, క‌రోనా నిబంధ‌న‌లు పాటిస్తూ షూటింగ్ చేయ‌బోతున్న‌ట్టు అధికారికంగా ప్ర‌క‌టించారు. ఈ  షెడ్యూల్ లో  సినిమాలోని కీలకమైన క్లైమాక్స్ సన్నివేశాలు అన్నిటినీ షూట్ చేస్తారట. ఏషియన్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఈ చిత్రంతో ఫస్ట్ టైమ్ నిర్మాణ రంగంలోకి అడుగు పెడుతుంది.

 


logo