బాలు, అప్సర జంటగా సత్య దర్శకత్వంలో రామ్‌ప్రసాద్ రెడ్డి వట్రపు నిర్మిస్తున్న చిత్రం ‘భానుమతి రెడ్డి’. గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ ప్రేమకథా చిత్రం ఫస్ట్‌లుక్‌ను రాజమండ్రి పార్లమెంట్ సభ్యుడు ఎం.భరత్‌రామ్ విడుదల చేశారు. ప్రేమలో వుండే సున్నితమైన భావోద్వేగాలతో పాటు అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ ఈ చిత్రంలో వున్నాయని దర్శకుడు తెలిపారు. సాగర్‌రెడ్డి వట్రపు, వినాయక్ కార్తీక్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: అభిషేక్.