ఆదివారం 25 అక్టోబర్ 2020
Cinema - Sep 07, 2020 , 23:39:14

లవ్‌స్టోరీ షురువైంది

లవ్‌స్టోరీ షురువైంది

లాక్‌డౌన్‌ కారణంగా ఆరు నెలలుగా మూగబోయిన సినీ పరిశ్రమలో మళ్లీ సందడి మొదలైంది. అగ్ర నాయకానాయికలు ఒక్కొక్కరుగా తమ సినిమా చిత్రీకరణలను పునఃప్రారంభిస్తున్నారు. నాగచైతన్య, సాయిపల్లవి జంటగా నటిస్తున్న ‘లవ్‌స్టోరీ’ సినిమా షూటింగ్‌ సోమవారం మొదలైంది. శేఖర్‌ కమ్ముల  దర్శకత్వం వహిస్తున్నారు. ఏమిగోస్‌ క్రియేషన్స్‌, సోనాలి నారంగ్‌ సమర్పణలో శ్రీ వెంకటేశ్వర సినిమాస్‌ ఎల్‌.ఎల్‌.పి పతాకంపై నారాయణ్‌దాస్‌ నారంగ్‌, పి.రామ్మోహన్‌రావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పదిహేను రోజుల పాటు ఏకధాటిగా సాగే షెడ్యూల్‌తో చిత్రీకరణ పూర్తికానుంది. నిర్మాతలు మాట్లాడుతూ ‘ప్రభుత్వ మార్గదర్శకాల్ని పాటిస్తూ తగిన జాగ్రత్తలతో షూటింగ్‌ చేస్తున్నాం. లొకేషన్‌లో కేవలం పదిహేను మంది ఉండేలా జాగ్రత్తపడుతున్నాం. షూటింగ్‌లో పాల్గొనేవారందరికీ ముందే కరోనా టెస్ట్‌లు నిర్వహించాం. ఈ షెడ్యూల్‌తో  సినిమా షూటింగ్‌ పూర్తవుతుంది. సరైన సమయం చూసుకొని సినిమాను థియేటర్‌లలో విడుదలచేస్తాం’ అని తెలిపారు. రాజీవ్‌ కనకాల, ఈశ్వరీరావు, దేవయాని ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: విజయ్‌.సి.కుమార్‌, సంగీతం: పవన్‌.సి.హెచ్‌. 


logo