టాలీవుడ్ (Tollywood) దర్శకుడు శేఖర్‌కమ్ముల (Sekhar Kammula) తెరకెక్కించిన చిత్రం లవ్‌స్టోరీ (Love Story). నాగచైతన్య (Naga Chaitanya), సాయిపల్లవి (Sai Pallavi) హీరోహీరోయిన్లుగా వచ్చిన ఈ మూవీ బాక్సాపీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. విడుదలైన అన్ని కేంద్రాల్లో విజయవంతంగా ప్రదర్శించబడుతుంది. తాజాగా ఈ చిత్రం అరుదైన ఘనత సొంతం చేసుకుంది. అమెరికాలో లవ్‌స్టోరీ విడుదలైన కేవలం 3 రోజుల్లోనే 1 మిలియన్ డాలర్ల (రూ.7 కోట్ల 37 లక్షలు) క్లబ్ లోకి చేరిపోయింది.
కోవిడ్ ప్రభావంతో సెకండ్ లాక్ డౌన్ తర్వాత థియేటర్లకు జనాలు వస్తారా..? రారా..? అన్న సందేహాలకు పుల్‌స్టాప్ పెడుతూ శేఖర్‌కమ్ముల బ్రాండ్ ఇమేజ్, చైతూ, సాయిపల్లవి నటనతో లవ్ స్టోరీ సక్సెస్‌పుల్ గా వసూళ్లను రాబడుతోందని తాజా సమాచారం. ఆదివారం రాత్రి వరకు 2021 అత్యధిక గ్రాస్ సాధించిన తెలుగు సినిమాగా లవ్‌స్టోరీ నిలిచింది. లవ్‌స్టోరీ 2 మిలియన్ల డాలర్ల మైల్స్టోన్ దిశగా వెళ్లడం విశేషం. యూఎస్ బాక్సాపీస్ వద్ద లవ్ స్టోరీకి వస్తున్న స్పందన..భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్న భారతీయ చిత్రాలకు తప్పకుండా ఆదరణ ఉంటుందన్న నమ్మకాన్ని కలిగిస్తోంది.
కరోనా ప్రభావంతో నష్టాల్లో ఉన్న థియేటర్ల యాజమాన్యాలకు లవ్ స్టోరీ సినిమా కొంత ఊరటనిచ్చేలా కనిపిస్తుందని అభిప్రాయపడుతున్నారు ట్రేడ్ పండితులు.
Rakul Preet Singh | రకుల్ ప్రీత్ సింగ్ సర్జరీ చేయించుకుందా..?
Vijay 66th | టాలీవుడ్ దర్శకుడితో విజయ్ కొత్త సినిమా..!
Rashmika Mandanna | అప్పుడు నో చెప్పింది..ఇపుడు ఒకే చేసింది
Raviteja Heroines | హీరోయిన్ల సాయం తీసుకుంటున్న రవితేజ