శుక్రవారం 05 జూన్ 2020
Cinema - Feb 14, 2020 , 23:31:09

ముద్దు పెడితే ఏడుస్తారాబ్బా?

ముద్దు పెడితే ఏడుస్తారాబ్బా?

‘ఏయ్‌ పిల్లా పరుగున పోదామా.. ఏ వైపో జంటగా ఉందామా..’ అంటూ ప్రియురాలితో  ప్రణయగీతాన్ని పాడుకుంటున్నారు నాగచైతన్య. ఆయన కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘లవ్‌స్టోరీ’. శేఖర్‌కమ్ముల దర్శకుడు. సాయిపల్లవి కథానాయిక. ఏమిగోస్‌ క్రియేషన్స్‌, సోనాలి నారంగ్‌ సమర్పణలో శ్రీ వెంకటేశ్వర సినిమాస్‌ ఎల్‌.ఎల్‌.పి పతాకంపై  నారాయణ్‌దాస్‌ కె నారంగ్‌, పి రామ్మోహన్‌రావు నిర్మిస్తున్నారు. ప్రేమికుల రోజు సందర్భంగా శుక్రవారం ఒక నిమిషం నిడివితో కూడిన  ‘ఏయ్‌ పిల్లా’  అనే వీడియో గీతాన్ని చిత్రబృందం విడుదలచేసింది. ఇందులో సాయిపల్లవి నాగచైతన్యకు ముద్దు ఇవ్వడంతో అతడు ఉద్వేగానికి లోనైనట్లుగా చూపించడం ఆకట్టుకుంటున్నది. అతడిని చూసి ‘ఏంది ముద్దు పెడితే ఏడుస్తారా అబ్బా’ అంటూ సాయిపల్లవి చెప్పే డైలాగ్‌  హృద్యంగా ఉంది.  ‘సున్నితమైన కథాంశంతో  తెరకెక్కుతున్న అందమైన లవ్‌స్టోరీ ఇది. సహజత్వాన్ని ప్రతిబింబిస్తూ వైవిధ్యంగా ఉంటుంది.  వేసవిలో విడుదల చేయబోతున్నాం. చివరి షెడ్యూల్‌ చిత్రీకరణ జరుగుతున్నది’ అని నిర్మాతలు తెలిపారు. రాజీవ్‌ కనకాల, ఈశ్వరీరావు, దేవయాని ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: విజయ్‌.సి.కుమార్‌, సంగీతం: పవన్‌ సీహెచ్‌.


logo