శ్రీకార్తికేయ, హిమాన్షీ, శుభాంగి పంత్ నాయకానాయికలుగా నటిస్తున్న చిత్రం ‘ఇట్లు అంజలి’. నవీన్ మన్నేల స్వీయ దర్శకత్వంలో రూపొందిస్తున్నారు. ఈ నెల 16న ఈ చిత్రం విడుదలకానుంది. ఈ సందర్భంగా దర్శకనిర్మాత మాట్లాడుతూ ‘ప్రేమలేఖ ఆధారంగా సాగే రొమాంటిక్ క్రైమ్ థ్రిల్లర్ ఇది. అంజలి ఎవరూ? ఆమె గురించి అన్వేషించే క్రమంలో ఓ యువకుడు తెలుసుకున్న వాస్తవాలేమిటన్నది ఆసక్తికరంగా ఉంటుంది. గతంలో తెలుగు తెరపై వచ్చిన థ్రిల్లర్ సినిమాలకు పూర్తి భిన్నంగా సాగే చిత్రమిది’ అని తెలిపారు. కాదంబరి కిరణ్, వెంకీ, అనంత్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: కార్తిక్ కొడకండ్ల, సినిమాటోగ్రఫీ: వి.కె. రామరాజు.