టాలీవుడ్ యంగ్ హీరో సంతోష్ (Santhosh Shobhan) శోభన్ నటిస్తోన్న తాజా చిత్రం మంచి రోజులొచ్చాయి (Manchi Rojulochaie). మారుతి (Maruthi) దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రంలో మెహరీన్ కౌర్ (Mehreen) హీరోయిన్ గా నటిస్తోంది. కాగా ఈ సినిమా ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు. మై వాట్సాప్ అంకుల్స్ అండ్ యూట్యూబ్ ఆంటీస్..నా పేరు సంతోష్..ఆనందానికి కేరాఫ్ అడ్రెస్ వీడు అనేది నా ట్యాగ్‌లైన్..అంటూ సంతోష్ శోభన్ తనను తాను పరిచయం చేసే సన్నివేశంతో ట్రైలర్ మొదలైంది.
నా కూతురు లాంటి కూతురిని కన్న ఎవరైనా సరే ఆరోగ్యంగా ఉండాల్సిందే..అంటూ అశిష్ ఘోష్ తన కూతురు గురించి చెప్పే సంభాషణలు ఆకట్టుకునేలా ఉన్నాయి. రియల్ లైఫ్ రోల్స్ ను స్పూర్తిగా తీసుకుని రూపొందిస్తున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో అంచనాలు భారీగానే ఉన్నాయి. ఎస్కేఎన్-వీ సెల్యూలాయిడ్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్ సంగీత దర్శకుడు. మారుతి తనదైన మార్క్ కామెడీ టచ్ తో వినోదాన్మి అంచించడం ఖాయమని ట్రైలర్ తో అర్థమవుతుంది.
ఈ చిత్రం యూత్‌ఫుల్ లవ్ ఎంటర్ టైనర్‌గా సాగనుందని తెలిసిపోతుంది. వెన్నెల కిశోర్, సప్తగిరి, వైవా హర్ష, అశిష్ ఘోష్ ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు.
ఇది కూడా చూడండి
Akhil Akkineni | గత పదేళ్ల నుంచి తనకిష్టమైన ఫొటో చూపించిన అఖిల్
Rowdy Boys | కలర్‌ఫుల్ పాటతో చిత్రీకరణ పూర్తి
Jacqueline Fernandez | ‘నీలిరంగు చీరలోనా..సందమామా నీవే జాణ’
Sunny Leone | స్వర్గంలో ఏంజెల్లా సన్నీలియోన్