నూతన తారలతో ప్రణవి పిక్చర్స్ సంస్థ నిర్మించిన చిత్రం ‘లాట్స్ ఆఫ్ లవ్’. స్వీయ దర్వకత్వంలో డా॥ విశ్వానంద్ పటార్ రూపొందించారు. శుక్రవారం ఈ సినిమా విడుదలైంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో దర్శకనిర్మాత విశ్వానంద్ పటార్ చిత్ర విశేషాలు తెలియజేస్తూ ‘ఈ సినిమాకు దర్శకత్వంతో పాటు కథ, మాటలు, సంగీతాన్ని సమకూర్చాను. ప్రేమ అంటే ఓ జంట మధ్య పుట్టేదే కాదు..భిన్న రకాలుగా ఉంటుందనే అంశాన్ని ఈ సినిమా ద్వారా చూపించాం.
మన వృత్తిని, సమాజాన్ని, కుటుంబాన్ని కూడా ప్రేమించాలనే సందేశంతో తెరకెక్కించాం. ఐదు భిన్న రకాల ప్రేమల్ని చర్చిస్తుంది. కొత్తవారైనా అందరూ చక్కటి అభినయాన్ని కనబరిచారు. తప్పకుండా తెలుగు ప్రేక్షకులకు కొత్త అనుభూతినందించే చిత్రమవుతుంది’ అన్నారు.