విశ్వానంద్ హీరోగా నటిస్తూ స్వీయ దర్శకత్వంలో రూపొందిస్తున్న సినిమా ‘లాట్స్ ఆఫ్ లవ్’. ఆద్య, నిహాంత్, దివ్య, రాజేష్, భావన కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ప్రణవి పిక్చర్స్, ఎస్ఎంవీ ఐకాన్ ఫిలింస్ సంస్థలు నిర్మిస్తున్నాయి. అనిత, ప్రఖ్యాత్ సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు. ఈ నెల 30న సినిమా విడుదలకు సిద్ధమవుతున్నది. తాజాగా చిత్ర ప్రీ రిలీజ్ కార్యక్రమాన్ని హైదరాబాద్లో నిర్వహించారు.ఈ సందర్భంగా దర్శక నిర్మాత నటుడు విశ్వానంద్ మాట్లాడుతూ..‘ఐదు కథల సమాహారం ఈ సినిమా. ప్రేమకు అర్థాన్ని చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. మహిళలు, పిల్లలు ఇష్టపడేలా ఉంటుంది. పాటలు బాగుంటాయి’ అన్నారు. ఈ కార్యక్రమంలో ఇతర చిత్రబృందం పాల్గొన్నారు.