మంగళవారం 20 అక్టోబర్ 2020
Cinema - Sep 24, 2020 , 13:40:59

ఆచార్యలో రామ్ చరణ్ ‌పాత్ర అదేనా?

ఆచార్యలో రామ్ చరణ్ ‌పాత్ర అదేనా?

మెగాస్టార్‌ చిరంజీవి నటిస్తున్న సోషల్ మెసేజ్ ఓరియెంటెడ్ మూవీ ఆచార్య. ఇందులో పవర్‌ఫుల్‌ దేవాదాయ ధర్మాదాయశాఖ అధికారి పాత్రలో కనిపించనున్నారు. హీరోయిన్‌గా కాజల్ అగర్వాల్ నటిస్తోంది. చిత్రంలో మెగా పవర్‌స్టార్‌ రామ్‌ చరణ్‌ సైతం ప్రధాన పాత్రలో నటించనున్నట్లు తెలుస్తోంది. దాదాపు 30 నిమిషాల పాటు రామ్ చరణ్ తెరపై సందడి చేస్తారని, ఒక మిషన్‌లో పని చేస్తూ ప్రాణాలు కోల్పోయే మాజీ నక్సలైట్ పాత్రను పోషించున్నారని వార్త టాలీవుడ్‌లో షికారు చేస్తోంది. ‘మిర్చి’, ‘భరత్ అనే నేను’ ఫేం కొరటాల శివ దర్శకుడు. మెగాస్టార్‌ పుట్టిన రోజు సందర్భంగా ఫస్ట్‌లుక్‌ విడుదల చేయగా.. మంచి స్పందన వచ్చింది.

సినిమాలో హైలెట్‌గా ఉండే పాటలో చిరంజీవి, రామ్‌చరణ్‌ ఒకే పాటలో కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ల సమయంలో వచ్చే ‘ఆచార్య’ సినిమాలో రామ్ చరణ్‌ది ఓ పవర్ ఫుల్ నక్సలైట్ పాత్ర. ఇందుకు చెర్రీకి లుక్ టెస్ట్ నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు మేకర్స్ సన్నిహిత వర్గాలు వెల్లడించాయి. ఇప్పటికే 70శాతం వరకు షూటింగ్‌ పూర్తయిందని తెలుస్తుండగా, మిగతా భాగాన్ని పూర్తి చేసేందుకు అక్టోబర్ షూటింగ్‌ ప్రారంభించేందుకు ప్లాన్‌ చేస్తున్నారు. ఈ సినిమాని కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo