ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చి సినీ పరిశ్రమలో నిలదొక్కుకోవాలంటే అంత చిన్న విషయమేమి కాదు. టాలెంట్ ఉన్నా ఎదగని తారలు చాలా మంది ఉన్నారు. సినిమాలపై ఇష్టంతో ఇండస్ట్రీకి వచ్చి ఎన్నో కష్టాలనష్టాలకోర్చి వన్ ఆఫ్ ది లీడింగ్ స్టార్ హీరోయిన్ గా మారిపోయింది బాలీవుడ్ (Bollywood) నటి కంగనారనౌత్. హిల్ స్టేషన్ హిమాచల్ ప్రదేశ్ (Himachal Pradesh)కు చెందిన ఈ బాలీవుడ్ క్వీన్ నటించిన భారీ ప్రాజెక్టు తలైవి ప్రేక్షకుల ముందుకొచ్చింది. కంగనారనౌత్ (Kangana Ranaut ) నటనకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. ఢిల్లీకి రాజైనా తల్లికి మాత్రం కొడుకే, ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలనే నానుడి కంగనారనౌత్ కు సరిగ్గా సరిపోతుంది.
స్టార్ హీరోయిన్ గా మారిన తన సొంతూరును మాత్రం మర్చిపోలేదు. కంగనా స్వస్థలం మండి జిల్లాలోని సూరజ్ పూర్ (Surajpur) పట్టణం. హిమాచల్ ప్రదేశ్ నుంచి చంఢీగడ్, అక్కడి నుంచి ఢిల్లీ, ముంబై, హైదరాబాద్ వరకు కంగనా విజయవంతంగా తన ప్రయాణాన్ని కొనసాగిస్తోంది..మనాలీలోని అందమైన పర్వత ప్రాంతాల్లో తన అభిరుచికి తగినట్టుగా ఇంటిని నిర్మించుకుంది. బిజీ షెడ్యూల్ లో కూడా వీలు దొరికినపుడల్లా ఇంటికి వెళ్లి తన కుటుంబసభ్యులతో సరదా సమయాన్ని గడుపుతుంది.
ఎప్పుడూ ఏదో ఒక వివాదం తలనొప్పులు తెస్తున్నా..వాటి నుంచి బయట పడేందుకు కుటుంబానికి తన సమయాన్ని కేటాయిస్తుంది కంగనా. కంగనా ఆహ్లాదకరంగా ఇంటి పట్టునే ఉన్నపుడు తీసిన స్టిల్స్ కొన్ని ఇపుడు నెట్టింట్లో ట్రెండింగ్ అవుతున్నాయి.
Sai Dharam Tej: ఆపరేషన్ సక్సెస్.. 24 గంటలు అబ్జర్వేషన్లో…!
Love Story: ప్రమోషన్ స్పీడ్ పెంచిన లవ్ స్టోరీ మేకర్స్..ట్రైలర్ రిలీజ్ ఎప్పుడంటే..!
Mrunal Thakur | విరాట్ కోహ్లీతో పిచ్చిగా ప్రేమలో పడ్డా: మృణాళ్ ఠాకూర్